Sunday, May 5, 2024

ధర్మపురి నియోజకవర్గ అభివృద్ధికి రూ. 4.20 కోట్లు

- Advertisement -
- Advertisement -

ధర్మపురి: జగిత్యాల జిల్లాలోని ధర్మపురి నియోజకవర్గ నియోజకవర్గ అభివృద్దికి రూ, 4.20 కోట్లు నిధులు మంజూరు చేసినట్లు రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. గురువారం మంత్రి ఈశ్వర్ మనతెలంగాణతో పోన్‌లో మాట్లాడుతూ నియోజకవర్గంలో పలు అభివృద్ది కార్యక్రమాలు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద మొత్తంగా నిధులు మంజూరు చేసిందన్నారు. బుగ్గారం మండలం వెల్గొండ నుండి ధర్మపురి మండలంలోని కమలాపూర్ వరకు ఫార్మేషన్ రోడ్డు నిర్మాణానికి రూ. 45 లక్షలు, ధర్మపురి మండలం దోనూర్ నుండి బోదరినక్కల చెరువు గూడెం వరకు రోడ్డు మరియు కల్వర్టు నిర్మాణానికి రూ. 35 లక్షలు మంజూరైనట్లు వివరించారు.

నేరెల్ల గ్రామంలోని కోతుల వాగు కల్వర్టు నిర్మాణానికి రూ. 25 లక్షలు, ఇదే గ్రామంలోని ఎల్లమ్మ టెంపుల్ నుండి చాకలి ఇప్ప ఒర్రె వరకు రోడ్డు రూ. 10లక్షలు, గొల్లపెల్లి మండలంలోని శ్రీరాముల పల్లె నుండి బిబిరాజ్ పల్లె వరకు ఫార్మేషన్ రోడ్డు నిర్మాణానికి రూ. 10 లక్షలు, పెగడపెల్లి మండలంలోని బతికెపెల్లి గ్రామంలో మెయిన్ రోడ్డు నుండి హనుమాన్ టెంపుల్ వరకు సిసి రోడ్డు నిర్మాణానికి రూ. 40 లక్షలు, ఇదే గ్రామంలో కముటం రాజమల్లు ఇంటి నుండి ఎల్లమ్మ టెంపుల్ వరకు సిసి రోడ్డు నిర్మాణం కోసం రూ. 35 లక్షలు మంజూరైనట్లు మంత్రి తెలిపారు.

అదే విధంగా వెల్గటూర్ మండలం పాతగూడూర్ నుండి పడకల్ వరకు బిటి రోడ్డు నిర్మాణానికి రూ. 1.65 కోట్లు మంజూరైనట్లు వివరించారు. నియోజకవర్గ అభివృద్దికి ప్రత్యేక చొరవతో నిధులు మంజూరు చేయించిన మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు నియోజకవర్గంలోని వివిధ స్థాయి ప్రజాప్రతినిధులు, నాయకులు, ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News