Tuesday, May 14, 2024

ఖాళీ అవుతోన్న గ్రేటర్ కాంగ్రెస్

- Advertisement -
- Advertisement -

Former mayor Banda Karthika Reddy joins BJP

హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. బల్దియా సమరంలో బలమైన అభ్యర్దులను బరిలోకి దించి మేయర్ పీఠం దక్కించుకుందామని భావిస్తే పార్టీకి చెందిన సీనియర్ నాయకులు గులాబీ, కాషాయ జెండాలు మోసేందుకు పరుగులు పెడుతున్నారు. దీంతో ఆపార్టీ పెద్దలు పార్టీ ఖాళీ అవుతోందని ఆందోళన చెందుతున్నారు. ఆఎన్నికల్లో అంగబలం, ఆర్దికబలమున్న నాయకులను సమరంలోకి దించి అధికార టిఆర్‌ఎస్‌ను మట్టికరింపిచాలని పన్నాగాలు చేస్తే ఆసలుకే ఎసరు వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో 150 డివిజన్లలో పోటీ చేసేందుకు అభ్యర్దులను దొరకడం కష్టమేనని నియోజకవర్గాల బాధ్యులు పేర్కొంటున్నారు.

మొన్నటివరకు బరిలో ఉంటానని పేర్కొన నాయకులు పార్టీని వీడుతూ పార్టీ కోసం శ్రమించిన వారికి గుర్తింపులేదని, కులబలం, ధనబలమున్న నేతలకు పెద్ద పీఠవేస్తున్నారని మండిపడుతూ దూరమైతున్నట్లు పార్టీ శ్రేణులు చెబుతున్నారు. బుధవారం గతంలో మేయర్‌గా పనిచేసిన బండా కార్తీకరెడ్డి తమ అనుచరులతో కలిసి కాషాయం జెండా కప్పుకున్నారు. వారి బాటలో శేరిలింగంపల్లి మాజీ ఎమ్మెల్యే భిక్షపతియాదవ్, ఆయన తనయుడు రవికుమార్ కూడా పార్టీ వీడుతున్నట్లు ప్రకటించారు. వెంటనే ఉత్తమ్, రేవంత్‌రెడ్డి బుజ్జగించే ప్రయత్నాలు చేసి విఫలమైయ్యాయి.వారు కాషాయం పార్టీ పెద్దలతో సంప్రదింపులు చేస్తున్నారు. అదే విధంగా పటాన్‌చెరుకు చెందిన గోదావరి అంజిరెడ్డి దంపతులు కూడా బిజెపి పంచన చేరుతున్నారు.వీరే కాకుండా చేవెళ్ల పార్లమెంటు బాధ్యులు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, కూన శ్రీశైలం, అంజన్‌కుమార్, విక్రంగౌడ్‌తో పాటు విష్ణువర్దన్‌రెడ్డి అనుచరులతో కమలనాథులు మంతనాలు జరుపుతున్నట్లు బిజెపి నాయకులు లీకులు చేస్తున్నారు.

ఎన్నికలు ప్రచారం ఊపుందుకునే సమయానికి మరింత పార్టీని వీడే అవకాశం ఉందని హస్తం సీనియర్లు అంచనా వేస్తున్నారు. మొన్నటి వరకు పార్టీలో చురుకుగా పనిచేసిన స్దానిక నాయకులు అకస్మాత్తుగా పార్టీకి దూరంగా కావడం పట్ల కాంగ్రెస్ నాయకులు ఎవరిని నమ్మాలో అర్దంకాక తలపట్టుకుంటున్నారు. మొదటి జాబితాలో 75మంది అభ్యర్దులను ప్రకటించాలని హైకమాండ్ భావిస్తే అందులో కొందరు నోటిఫికేషన్ విడుదలైన తరువాత అందుబాటులో లేరని, గమనించిన పార్టీ నాయకులు 29మందితో కూడిన మొదటి లిస్టును విడుదల చేశారు. గురువారం మరో 25మందితో కూడిన జాబితా ప్రకటిస్తామని వెల్లడిస్తున్నారు.

నియోజకవర్గాలకు చెందిన ఇంచార్జీలు పార్టీకి దూరంగా కావడంతో అక్కడి డివిజన్లలో కొత్త అభ్యర్దులను నిలబెట్టే పరిస్దితి నెలకొందంటున్నారు.కాంగ్రెస్ నాయకులు పార్టీ వీడుతుండటంతో ప్రజల్లో పార్టీ ప్రభావం తగ్గుతుందని, పోటీ చేసిన అభ్యర్దులకు డిపాజిట్ రావడంపై ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హస్తం పార్టీకి ప్రచారం చేసేందుకు కిందిస్దాయి నాయకులు వెనకడుగు వేస్తున్నట్లు, అభ్యర్దులు నామినేషన్లు అట్టహాసంగా వేయాలని భావిస్తే, గుట్టుచప్పుడుగా వేసే వాతావరణం కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. బరిలో నిలిచి అభ్యర్దులు అఖరు వరకు రంగంలో ఉంటారో లేదో పార్టీ నాయకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News