Friday, April 19, 2024

విద్యార్థినుల ఫొటోలు మార్ఫింగ్.. నలుగురు నిందితులు అరెస్టు

- Advertisement -
- Advertisement -

ఎల్బీనగర్: ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థినుల ఫొటోలు మార్ఫింగ్ చేసి వేధిస్తున్న నలుగురు నిందితులను ఘట్‌కేసర్ పోలీసులకు చిక్కారు. ఎల్బీనగర్ సిపి క్యాంపు కార్యాలయంలో రాచకొండ సిపి డిఎస్ చౌహన్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిందితుల వివరాలు వెల్లడించారు. ఆంధ్రపదేశ్‌కు చెందిన గూంటుర్ జిల్లా వట్టిచెరుకు మండలం కొర్రేపాడు గ్రామానికి చెందిన లక్ష్మి గణేష్ (19) ఇంటర్ ఫెయిల్ అయి ఓ ప్రైవేటు సంస్థలో పని చేస్తున్నాడు. అదే గ్రామానికి ప్రదీప్ అలియాస్ పేతూర్ (19) ఇంటర్ ఫెయిల్ అయి విజయవాడలో నివాసం ఉంటున్నాడు. విజయవాడ తాడేపల్లికి చెందిన సతీష్ (20) చెఫ్‌గా పని చేస్తున్నాడు. విజయవాడ వైఎస్‌ఆర్ కాలనీకి చెందిన దుర్గా ప్రసాద్ (20) డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నాడు.

వీరు ఘట్‌కేసర్ మండలం అవుషాపూర్‌లోని విబిఐటి ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థినుల ఫొటోలు సేకరించి వాటిని మార్ఫింగ్ చేసి బెదిరింపులకు పాల్పడుతున్నారు. మొదట నిందితులు ఏదో ఒక నంబర్‌కు కాల్ చేసి, అమ్మాయిల గొంతు వినిపించగానే తరుచూ ఒక ఫోన్ చేసి వారితో స్నేహం పెంచుకునేవారు. వాట్సాప్ డిపిలలో ఉన్న అమ్మాయిల ఫొటోలను సేకరించి మార్ఫింగ్ చేసేవారు. విద్యార్థినులతో ఎలాంటి పరిచయం లేకపోయిన సోషల్ మీడియాలో కొన్ని గ్రూపులు ఏర్పాటు చేసి వారిని ఆ గ్రూపులలో చేర్చిన తరువాత వారిని వేధిస్తున్నారు. మొదట ఒక అమ్మాయిని పరిచయం పెంచుకొని ఆమెను బ్లాక్ మెయిల్ చేసి ఇతరుల నంబర్లులను సేకరించిన తరుతవాత వారి నంబర్లకు లింకులు పంపించి డేటాను హ్యాక్ చేసేవారు. ఆ తరువాత మార్ఫింగ్ ఫొటోలను సోషల్ మీడియాలో పెడుతామని బెదిరింపులకు పాల్పడ్డారు.

వీరి వేధింపులు తాళలేక ఓ విద్యార్థిని ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి విజయవాడలో నిందితుల నలుగురిని పట్టుకున్నామన్నారు. అమ్మాయిలను సోషల్ మీడియాలో వేధిస్త్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ప్రతి కళాశాలలో సైబర్ మోసాలపై అవగావన కల్పిస్తాం సిసి తెలిపారు. ఐపిసి పోక్సో చట్టం క్రింద కేసులు నమోదు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి డిసిపి రక్షితమూర్తి, ఎసిపి నరేష్‌రెడ్డి , ఇన్‌స్పెక్టర్ అశోక్‌రెడ్డి, ఎస్‌ఐలు సుధాకర్ , శివకృష్ణ మూర్తి, ధనంజయ్య , రాము, నాగార్జున రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News