Sunday, April 28, 2024

భారీ వర్షాలతో ప్రాజెక్టులకు పెరిగిన వరద

- Advertisement -
- Advertisement -

Four gates of Sriram Sagar project lifted

శ్రీరాంసాగర్ గేట్లు ఎత్తివేత
శ్రీశైలంకు పెరిగిన నీటిప్రవాహం
మూసిగేట్లు ఎత్తివేత

మనతెలంగాణ/హైదరాబాద్ : గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ప్రధాన నదుల్లో వరద నీటిప్రవాహాలు మళ్లీ పెరుగుతూ వస్తున్నాయి. గోదావరిలో నీటి ప్రవాహం పెరగటంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నాలుగు గేట్లు ఎత్తివేశారు. ఇప్పటికే శ్రీరాం సాగర్ జలాశయంలో నీటిమట్టం పూర్తి స్థాయిలో ఉంది, ఎగువ నుంచి రిజర్వాయర్‌లోకి 15520క్యూసెక్కుల నీరు చేరుతుండగా, ప్రాజెక్టు నాలుగు గేట్లు తెరిచారు. రిజర్వాయర్ నుంచి 21455క్యూసెక్కుల నీటిని బయటకు విడుదల చేస్తున్నారు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి కూడా 22669క్యూసెక్కుల నీరు చేరుతోంది. ఈ రిజర్వాయర్‌లో ఇప్పటికే 96శాతం నీటిని నిలువ చేశారు. దీంతో ఎగువ నుంచి వస్తున నీటిని వచ్చినట్టే రిజర్వాయర్ నుంచి బయటకు విడుదల చేస్తున్నారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో నిజాంసాగర్ జలాశయంలోకి 1131క్యూసెక్కులు, సింగూరు జలాశయంలోకి 1241క్యూసెక్కుల నీరు చేరుతోంది.

వేంగంగా నిండుతున్న మల్లన్న సాగర్ :

కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో అంతర్బాగంగా నిర్మించిన మల్లన్న సాగర్ జలాశంయ వేగంగా నిండుతూ వస్తోంది. ఇప్పటికే ఈ జలాశయంలోకి 4.30టింసిల నీరు చేరుకుంది. నాలుగు మోటార్ల ద్వారా 7800క్యూసెక్కుల నీటిని జలాశయంలోకి ఎత్తిపోస్తున్నారు.

శ్రీశైలంకు 16980క్యూసెక్కులు

కృష్ణానదిలో కూడా వరదనీటి ప్రవాహం క్రమేపి పెరుగుతూ వస్తోంది. ఎగువన జూరాల జలాశయంలోకి 9500క్యూసెక్కుల నీరు చేరుతుండగా , ప్రాజెక్టు గేట్ల ద్వారా జలాశయం నుంచి 11103క్యూసెక్కుల నీటిని బయటకు విడుదల చేస్తున్నారు . దీంతో శ్రీశైలం రిజర్వాయర్‌లోకి అటు తుంగభద్ర , ఇటు కృష్ణానదుల ద్వార 16980క్యూసెక్కుల నీరు చేరుతోంది. ప్రాజెక్టులో నీటిమట్టం 875అడుగుల స్థాయిలోవుంది. రిజర్వాయర్ నుంచి 60188క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్‌లోకి 27213క్యూసెక్కుల నీరు చేరుతుండగా , ప్రాజెక్టు నీటిమట్టం 586.40అడుగుల స్థాయిలో ఉంది. జలాశయం నుంచి 47788క్యూసెక్కుల నీటిని బయటకు వదులుతున్నారు. దిగువన పులిచింతల జాశయంలోకి 35655క్యూసెక్కుల నీరు చేరుతుండగా, 39,594క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

మూసీ గేట్లు ఎత్తివేత

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున వర్షాలతో మూసినదిలో వరద ప్రవాహం మళ్లీ పుంజుకుంది. మూసి రిజర్వాయర్‌లోకి ఎగువ నుంచి 3850క్యూసెక్కుల నీరు చేరుతోంది. ప్రాజెక్టులో ఇప్పటికే నీటినిలువ 91శాతం ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. దీంతో మూసి ప్రాజెక్టు 3గేట్లు ఎత్తివేశారు. రిజర్వాయర్ నుంచి 4158క్యూసెక్కుల నీటిని బయటకు విడుదల చేస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News