Monday, April 29, 2024

రష్యాతో భారత్ భారీ ఆయుధాల కొనుగోలు ఒప్పందం

- Advertisement -
- Advertisement -

India's arms deal with Russia

న్యూఢిల్లీ : భారత రక్షణ దళాల ఆయుధ వ్యవస్థల ఆధునికీకరణ వేగవంతమైంది. ఈ మేరకు భారత వాయుసేన రష్యా నుంచి పెద్ద ఎత్తున ఆయుధాల కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకుంది. ప్రస్తుతం ఉన్న ఐఎన్‌ఎస్‌ఏఎస్ రైఫిల్స్‌కు బదులుగా ఏకే-103 అజాల్ట్ రైఫిల్స్‌ను సమకూర్చుకోబోతోంది. రూ.300 కోట్లతో దాదాపు 70 వేల ఏకే-103 అజాల్ట్ రైఫిల్స్ కొనుగోలుకు భారత వాయు సేన(ఐఏఎఫ్) రష్యాతో ఒప్పందం కుదుర్చుకుంది. ఆఫ్ఘనిస్థాన్‌లో అమెరికా దళాలు వదిలేసిన ఆయుధాలు భారత్‌లోని ఉగ్రమూకలకు చేరే అవకాశం ఉన్న నేపథ్యంలో అత్యవసర నిబంధనల క్రింద ఐఏఎఫ్ ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. అలాగే ఏకే-103 కన్నా ఎక్కువ సామర్థ్యంగల ఏకే-203 రైఫిల్స్ కొనుగోలుకు కూడా రష్యాతో ఒప్పందానికి చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ఒప్పందం మేరకు ఆయుధాలు అందుబాటులోకి వస్తే.. ఉగ్రవాద చర్యలను మరింత సమర్థవంతంగా తిప్పికొట్టడానికి వీలవుతుంది. వీటిని మొదట జమ్మూ-కశ్మీరు, శ్రీనగర్, కీలక వాయు సేన స్థావరాల్లోని దళాలకు అందజేస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News