Wednesday, May 8, 2024

వర్క్ ఫ్రం హోం కోసం వెతికి.. సైబర్ నేరస్థుల బారినపడిన దంపతులు

- Advertisement -
- Advertisement -

Fraud with work from home couple losed 60 lakhs

మనతెలంగాణ, హైదరాబాద్ : వర్క్ ఫ్రం హోం కోసం గూగుల్‌లో వెతికిన దంపతులను నిండా ముంచారు సైబర్ నేరస్థులు. వారి బ్యాంక్ ఖాతా నుంచి విడతల వారీగా రూ.60లక్షలు దోచుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం…అమీర్‌పేటకు చెందిన వంశీమోహన్ దంపతులు వర్క్ ఫ్రం హోం కోసం గూగుల్‌లో వెతికారు. ఈ క్రమంలోనే సైబర్ నేరస్థులు వీరి మొబైల్ ఫోన్‌కు లింక్ పంపించారు. తర్వాత ఫోన్ చేసి జాప్ బిట్ అనే ఎపికే ఫార్మాట్‌లో ఉండే మొబైల్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని చెప్పడంతో అలాగే చేశారు. ఈ యాప్ ద్వారా సైబర్ నేరస్థులు మూడు విడతలుగా రూ.60లక్షలు వారి బ్యాంక్ ఖాతాలకు ఆన్‌లైన్‌లో ట్రాన్స్‌ఫర్ చేసుకున్నారు. కొద్ది సేపటి తర్వాత తెలుసుకున్న బాధితులు తాము మోసపోయామని గ్రహించారు. వెంటనే హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News