Wednesday, May 1, 2024

ఉత్తరాఖండ్‌కు ఉచిత విద్యుత్: కేజ్రీవాల్

- Advertisement -
- Advertisement -

Free electricity to Uttarakhand:kejriwal

 

డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ ప్రజలకు ఆమ్ ఆద్మీ పార్టీ నేత , ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్ ఉచిత విద్యుత్ హామీలు ప్రకటించారు. ప్రతి కుటుంబానికి నెలకు 300 యూనిట్ల విద్యుత్, పాత బిల్లుల బకాయిల మాఫీ, రైతులకు ఉచిత కరెంటు అందిస్తామని ప్రకటించారు. వచ్చే ఏడాది ఉత్తరాఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఇక్కడికి వచ్చిన కేజ్రీవాల్ ఆదివారం విలేకరులతో మాట్లాడారు. ఈసారి అసెంబ్లీ ఎన్నికలలో తమ పార్టీని గెలిపించాలని, విద్యుత్ సరఫరా సజావుగా జరిగేలా చూస్తూ, పలు వెసులుబాట్లు కల్పిస్తామని ఈ పర్వత ప్రాంత రాష్ట్ర ప్రజలకు మీడియా ద్వారా తెలియచేసుకున్నారు. ఢిల్లీలో చేశామని, ఉత్తరాఖండ్‌లో కూడా చేయగలమని, తమ పార్టీని నమ్మండని తెలిపారు. విద్యుత్ కోతలు ఉండవు. కోతలు లేకుండా ఉచిత విద్యుత్ దిశలో ఆప్ ముందుకు వెళ్లుతుందని చెప్పారు. ఢిల్లీలో తాము అధికారం చేపట్టిన తొలినాళ్లలో రోజుకు 7 , 8 గంటల కరెంట్ కోతలు ఉండేవి. తరువాత తాము ఈ పరిస్థితిని చక్కదిద్దామని, ఇక్కడి ప్రజలు దీనిని గుర్తించాలని కోరారు. పంజాబ్‌కు సంబంధించి కూడా ఆప్ ఇటీవలే ఉచిత విద్యుత్ వాగ్దానం చేశారు. అక్కడ కూడా వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News