Monday, April 29, 2024

నేటి నుంచే ఉచితం

- Advertisement -
- Advertisement -

బస్సు ఛార్జీల్లేకుండా మహిళలకు ప్రయాణ సౌకర్యం

నేడు అసెంబ్లీ ప్రాంగణంలో ప్రారంభించనున్న సిఎం రేవంత్ రెడ్డి

త్వరలో మహాలక్ష్మి స్మార్ట్ కార్డుల జారీ
మార్గదర్శకాలు వెల్లడించిన ఆర్‌టిసి ఎండి సజ్జనార్

సోనియా సందర్భంగా ప్రభుత్వం కానుక

మన తెలంగాణ/ హైదరాబాద్:  నేటి మధ్యాహ్నం (శనివారం) నుంచి మహిళలకు ఆర్‌టిసి బస్సుల్లో ఉచిత ప్రయాణం పథకం అమ లు కానుంది. దానికి సంబంధించి ఉత్తర్వులను జారీ చేయడంతో పాటు దీనికి సంబంధించి మార్గదర్శకాలను ప్రభుత్వం జారీ చేసింది. శనివారం మధ్యాహ్నం 1.30 గంటలకు అసెంబ్లీ ప్రాంగణం నుంచి ఈ పథకాన్ని సిఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలోనే మహిళలకు ఆర్‌టిసి బస్సుల్లో ఉచిత ప్రయాణానికి రాష్ట్ర ప్రభుత్వం అ న్ని ఏర్పాట్లను చేసింది. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఆర్‌టిసి బస్సుల్లో ఉచిత ప్రయాణం క ల్పిస్తామని అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పా ర్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో మహాలక్ష్మి పథకం ఒకటి. అందులో భాగంగా ఈ పథకాన్ని సోనియాగాంధీ జన్మదినం రోజున ప్రారంభించాలని ప్రభుత్వం భావించింది. ఈ నేపథ్యంలో పథకాన్ని నేటి నుంచి అమల్లోకి తీసుకొస్తుంది. పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సులతో పాటు హైదరాబాద్‌లో నడిచే సిటీ ఆర్డీనరి, మెట్రో ఎక్స్‌ప్రెస్‌ల్లోనూ మహిళలకు ఈ ఉచిత ప్రయాణం కల్పించనుంది.

బాలికలు, మ హిళలు, ట్రాన్స్‌జెండర్లు ఉచిత ప్రయాణానికి అర్హులుగా ప్రభుత్వం తెలిపింది. రాష్ట్ర పరిధిలోని ఆర్ టిసి బస్సుల్లో మాత్రమే ఈ ఉచిత ప్రయాణం ఉం డనుంది. మహిళా ప్రయాణికుల ఛార్జీ మొత్తాన్ని ఆర్‌టిసి ప్రభుత్వమే చెల్లించనుంది. మహిళా ప్ర యాణికులు ప్రయాణించే వాస్తవ దూరం ఆధారం గా వసూలు చేసే ఛార్జీలను ప్రభుత్వం ప్రభుత్వం రీయింబర్స్ చేయనుంది. స్థానికత గు ర్తింపు కార్డు చూపించి మహిళలు ప్రయాణించవచ్చని అధికారులు తెలిపారు. జిఒ నంబర్ 47 ద్వా రా మహాలక్ష్మి పథకం విధి, విధానాలను ప్రభుత్వం వెల్లడించింది. స్థానికత ధ్రువీకరణ కోసం గుర్తింపుకార్డును ప్రయాణ సమయంలో కండక్టర్‌లకు చూపించాలని ప్రభుత్వం పేర్కొంది. ప్రయాణించే ప్రతి మహిళకు జీరో టికెట్ మంజూరు చేయనున్నారు. దాదాపు 40 వేల మంది డ్రైవర్లు, కండక్టర్‌లతో శుక్రవారం ఉదయం, మధ్యాహ్నం రెండుసార్లు వర్చువల్‌గా సమావేశాలు నిర్వహించినట్టు ఆర్టీసి ఎండి సజ్జనార్ తెలిపారు. ఉచిత బస్సు ప్రయాణ మార్గదర్శకాలను వారికి వివరించామని ఆయన పేర్కొన్నారు. ఇది చారిత్రాత్మక నిర్ణయమని ఆయన పేర్కొన్నారు.
ఈ పథకం కోసం 7200 బస్సులు : ఎండి సజ్జనార్
భవిష్యత్‌లో మహాలక్ష్మిస్మార్ట్ కార్డు జారీ చేసే సాప్ట్‌వేర్ డెవలప్ చేస్తున్నామని త్వరలోనే వాటిని ప్రయాణికులకు అందజేస్తామన్నారు. మహాలక్ష్మిపథకం వల్ల ప్రజా రవాణా పుంజుకుంటుందని, ఈ స్కీమ్ ద్వారా మహిళల స్వయం శక్తి మెరుగవుతుందని ఆర్టీసి ఎండి సజ్జనార్ అన్నారు. ఆర్టీసిలో మహిళలకు ఉచిత ప్రయాణం వల్ల ట్రాఫిక్ సమస్యలు, ప్రమాదాలు తగ్గుతాయన్నారు. భవిష్యత్‌లో కొత్త బస్సులు కూడా రానున్నాయని, సంస్థలో నియామకాలు కూడా చేపట్టనున్నామన్నారు. 7200 బస్సులను ఈ పథకం కోసం వాడబోతున్నామని ఈ స్కీమ్ ద్వారా సంస్థకు రాబోయే రోజుల్లో రూ.3వేల కోట్ల భారం పడే అవకాశం ఉందన్నారు. ఉచిత బస్సు ప్రయాణంపై సిబ్బందికి సూచనలు చేశామని మహిళలంతా సహకరించి ఉచితంగా ప్రయాణం చేయాలని ఎండి సూచించారు.
సిబ్బంది ఓపికతో, సహనంతో వ్యవహరించాలి
ఉచిత ప్రయాణంతో బస్సుల్లో రద్దీ పెరిగే అవకాశమున్నందున, బస్‌స్టేషన్‌లో నిర్వహణపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. ఉచిత ప్రయాణం అమల్లో ప్రతి సిబ్బంది క్రమశిక్షణతో వ్యవహారించాలని, ఓపిక, సహనంతో విధులు నిర్వర్తించాలని ఆయన సూచించారు. రెండేళ్లుగా సిబ్బంది ప్రవర్తనలో మార్పు వచ్చిందని, దాని వల్లే సంస్థ రెవెన్యూ పెరిగిందని ఆయన గుర్తుచేశారు. అదే స్పూర్తితో ‘మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎండి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రజలందరూ టిఎస్ ఆర్టీసి సిబ్బందికి సహకరించాలని ఎండి కోరారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News