Tuesday, April 30, 2024

నూతన సంవత్సరం నుంచి ఉచిత నీటి సరఫరా

- Advertisement -
- Advertisement -

Free water supply in Hyderabad from 2021

ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం నేరవేర్చే దిశగా ప్రభుత్వం అడుగులు
సాధ్యసాధ్యాలను పరిశీలిస్తున్న జలమండలి అధికారులు
ఇకా నుంచి నెలవారీ బిల్లులు యాజమానులు కట్టాల్సిన పనిలేదు
దేశ రాజధాని ఢిల్లీ తరహాలో అమలు చేసేందుకు కసరత్తు

హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల్లో సిఎం కెసిఆర్ నగర ప్రజలకు ఉచితంగా మంచినీటి సరఫరా చేస్తామనే హామీ నూతన సంవత్సరంలో అమలు చేసేందుకు ప్రయత్నాలు వేగం చేసినట్లు జలమండలి అధికారులు పేర్కొంటున్నారు. అందుకోసం సంబంధించిన అధికారులు సాధ్యసాధ్యాలను పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు. ప్రభుత్వం నుంచి అధికారికంగా ఉత్తర్వులు వస్తే ఉచితంగా నీటి సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు బోర్డు ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. ఎంత భారమైన ప్రజలకు రోజుకు 20వేల లీటర్లు సకాలంలో సరఫరా చేసి, ఇకా నుంచి నెలవారీ బిల్లులు వసూలు చేయమంటున్నారు. మహానగరంలో 22 డివిజన్ల పరిధిలో 10.40లక్షల నల్లా కనెక్షన్లుండగా వాటి ద్వారా రోజుకు 460ఎంజిడిల వాటర్‌ను క్రమం తప్పకుండా ప్రజలకు సరఫరా చేస్తున్నారు. నెలకు నల్లా బిల్లులు రూ. 120 కోట్లు వసూలు చేస్తున్నట్లు వచ్చే ఏడాది నుంచి ఆ వసూలు లేవంటున్నారు. వాటర్‌బోర్డు నెలకు ఉద్యోగుల జీత భత్యాల నిర్వహణ, ఇతర ఖర్చులకు కలిపితే రూ. 160కోట్లు వస్తుండగా, నెలకు రూ. 40కోట్లవరకు భారమైన నీటి సరఫరా చేస్తామని డివిజన్లకు చెందిన అధికారులు పేర్కొంటున్నారు.

అదే విధంగా కేశవాపూర్ ప్రాజెక్టు పనులు కూడా త్వరలో పూర్తి చేసి, భవిష్యత్తులో నగరంలో నీటి ఇబ్బందులు లేకుండా చేస్తామంటున్నారు. రెండు నెలల కితం కురిసిన వానలకు గ్రేటర్ పరిధిలో ఉన్న జంట జలాశయాలైన ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ పదేళ్ల తరువాత పూర్తిగా నిండాయి. దీంతో రెండేళ్లవరకు ఈరెండు ప్రాజెక్టులు నీరందిస్తాయి. కృష్ణా, గోదావరి నుంచి వచ్చే నీటికి ఖర్చు ఎక్కువ అవుతుందని, వేసవిలో ఈరెండు ప్రాజెక్టులు నగర దాహార్తిని తీర్చాయి. ఈఏడాది మాత్రం అలాంటి ఇబ్బందులులేవని అధికారులు వెల్లడిస్తున్నారు. నాణ్యతతో కూడిన ఉచిత నీటి సరఫరా చేస్తామని, దీనిపై ప్రజలు ఎలాంటి అనుమానం చెందాల్సిన పనిలేదంటున్నారు.

అదే విధంగా కొత్త పైపులైన్లు, దెబ్బతిన వాటి చోట మరమ్మత్తులు చేపట్టనున్నట్లు, లైన్‌మెన్ల సంఖ్య పెంచి, ఇప్పటివరకు ఏవిధంగా సరఫరా చేస్తామో అదే స్దాయిలో అందరికి సమయానికి సరఫరా చేస్తామని జలమండలి అధికారులు వివరిస్తున్నారు. దేశ రాజధాని డిల్లీ తరహాలో ఉచిత నీటి సరఫరాను అమలు చేసి దక్షిణాది రాష్ట్రాలో ముందుగా ప్రవేశ పెట్టిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుందని, సర్కార్ నిర్ణయంపై నగర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మంచినీటి సరఫరా సక్రమంగా ఉంటే ప్రజల అన్ని అవసరాలు తీర్చినట్లేనని బస్తీ,కాలనీ సంఘాలు నాయకులు పేర్కొంటున్నారు.టిఆర్‌ఎస్ ప్రభుత్వం మేయర్ పీఠం దక్కించుకుని మరో ఐదేళ్లు అభివృద్ది మరింత ముందుకు తీసుకెళ్లాలని కోరుతున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News