Tuesday, April 30, 2024

గాడిలో పడుతున్న ఆటలు

- Advertisement -
- Advertisement -

French Open 2020 to begin from Sept 20

లండన్: కరోనా మహమ్మరి దెబ్బకు ఎక్కడి కక్కడే నిలిచి పోయిన క్రీడలు ఇప్పుడిప్పుడే గాడిలో పడుతున్నాయి. క్రికెట్, ఫుట్‌బాల్, టెన్నిస్, ఫార్మూలావన్ తదితర క్రీడలు తిరిగి ప్రారభమవుతున్నాయి. దాదాపు నాలుగు నెలల సుదీర్ఘ విరామం తర్వాత ఇంగ్లండ్‌వెస్టిండీస్ సిరీస్‌తో అంతర్జాతీయ క్రికెట్ మళ్ల ప్రారంభమైంది. ఇక యుఎఇ వేదికగా సెప్టెంబర్ 19 నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ ట్వంటీ20 టోర్నమెంట్ జరుగనుంది. దీని కోసం ఇప్పటికే ఆయా జట్ల క్రికెటర్లు యుఎఇ చేరుకున్నారు. దీంతో ఎడాది దేశంలో క్రికెట్ సందడి ప్రారంభమైంది. మరోవైపు పాకిస్థాన్‌ఇంగ్లండ్ జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ విజయవంతంగా ముగిసింది. త్వరలోనే టి20 సిరీస్ కూడా జరుగనుంది. ఆస్ట్రియా వేదికగా ఫార్మూలావన్ రేసు కూడా జరిగింది. ఆ తర్వాత కూడా ఫార్మూల్ వన్ రేసులు షెడ్యూల్ ప్రకారం కొనసాగుతూనే ఉన్నాయి. త్వరలోనే యూఎస్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌లు జరుగనున్నాయి. కరోనా దెబ్బకు ప్రపంచ వ్యాప్తంగా క్రీడా రంగం మొత్తం కుదేలైన విషయం తెలిసిందే. మహమ్మరి తీవ్ర రూపం దాల్చడంతో క్రికెట్, టెన్నిస్, ఫుట్‌బాల్, హాకీ, బ్యాడ్మింటన్, రగ్బీ తదితర క్రీడలు ఎక్కడికక్కడే నిలిచి పోయాయి. క్రీడాకారులకు కనీసం ప్రాక్టీస్ చేసే పరిస్థితి కూడా లేకుండా పోయింది. మార్చిలో ప్రారంభమైన ఈ పరిస్థితి ఆగస్టుకు వచ్చే సరికి కాస్త తగ్గిందనే చెప్పాలి. యూరప్‌ను వణికించిన కరోనా ఇప్పుడిప్పుడే తగ్గు ముఖం పడుతోంది.

దీంతో పలు యూరప్ దేశాల్లో ఆంక్షలను క్రమంగా సడలిస్తున్నారు. కరోనా దెబ్బకు ఇప్పటికే వింబుల్డన్ వంటి ప్రతిష్టాత్మకమైన గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీని పూర్తిగా రద్దు చేశారు. మరోవైపు ఫ్రెంచ్ ఓపెన్‌ను వాయిదా వేశారు. కాగా, అమెరికాలోని న్యూయార్క్ నగరం వేదికగా ప్రతి ఏడాది ప్రతిష్టాత్మకమైన యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ నిర్వహించడం అనవాయితీగా వస్తోంది. కానీ, ఈ ఏడాది కరోనా దెబ్బతో యూఎస్ జరుగుతుందా అని అందరూ ఆందోళన చెందారు. అయితే ఇప్పుడిప్పుడే న్యూయార్క్ మహా నగరంలో పరిస్థితులు మాములు స్థితికి చేరుకుంటున్నాయి. ఇలాంటి స్థితిలో ఖాళీ స్టేడియాల్లో యూఎస్ ఓపెన్‌ను నిర్వహించేందుకు అక్కడి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. పరిస్థితులు మాములుగా మారితే టోర్నీని చూసేందుకు అభిమానులకు అనుమతి ఇచ్చినా ఆశ్చర్యం లేదు. అయితే దీనిపై ప్రభుత్వం నుంచి మాత్రం యూఎస్ ఓపెన్ నిర్వాహకులకు ఎటువంటి అధికారిక హామీ లభించలేదు. మరోవైపు ఫ్రాన్స్ రాజధాని పారిస్ వేదికగా జరిగే మరో గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ ఫ్రెంచ్ ఓపెన్‌ను మాత్రం అభిమానుల సమక్షంలో నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని టోర్నీ నిర్వాహకులే స్పష్టం చేశారు.

అయితే ఎంత మంది అభిమానులకు అనుమతి ఇస్తారనేది మాత్రం ఇంకా తేలలేదు. కానీ, ఖాళీ స్టేడియాల్లో మాత్రం గ్రాండ్‌స్లామ్ టోర్నీ జరగదని, అభిమానులకు తప్పనిసరిగా అనుమతి ఉంటుందని నిర్వాహకులు ప్రకటించారు. చాలా కాలంగా టెన్నిస్ క్రీడలను చూడకుండా దూరంగా ఉన్న అభిమానులకు ఇది పెద్ద ఊరట కలిగించే అంశంగానే చెప్పాలి. తమ అభిమాన ఆటగాళ్ల విన్యాసాలను ప్రత్యక్షంగా చూడాలని అభిమానులు తహతహలాడుతున్నారు. ముఖ్యంగా ఫ్రెంచ్ ఓపెన్‌లో రారాజుగా వెలుగొందుతున్న స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ అభిమానులకు ఇది పెద్ద ఊరట కలిగిస్తుందనే చెప్పాలి. తొలుత ఖాళీ స్టేడియాల్లోనే ఫ్రెంచ్ ఓపెన్ జరుగుతుందని అందరూ భావించారు. కానీ, కరోనా తగ్గు ముఖం పట్టడంతో ఫ్రాన్స్ ప్రభుత్వం క్రీడలపై అమలు చేస్తున్న ఆంక్షలను క్రమంగా సడలిస్తోంది. ఇందులో భాగంగానే ఫుట్‌బాల్, టెన్నిస్ తదితర క్రీడలను చూసేందుకు అభిమానులకు అనుమతి ఇవ్వాలని నిర్ణయించింది. దీంతో ఈ ఏడాది సెప్టెంబర్ 20 నుంచి ప్రారంభమయ్యే ఫ్రెంచ్ ఓపెన్ ప్రేక్షకుల సమక్షంలో జరుగనుంది. ఇది క్రీడాకారులకు, అభిమానులకు శుభసూచకంగా చెప్పక తప్పదు.

French Open 2020 to begin from Sept 20

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News