Wednesday, May 8, 2024

వర్షాలు కురవాలని కప్పలకు పెళ్లి

- Advertisement -
- Advertisement -

కారేపల్లి : వర్షాలు కురవాలని వరుణ దేవుడిని ప్రార్థిస్తూ , మండల పరిధిలోని పేరుపల్లి యువకులు ఆదివారం కప్పలకు పెళ్లి చేశారు. ముందుగా గ్రామంలో కావిడికి వేపాకులు కట్టి, అకావిడికి కట్టిన జోలెలో రెండు కప్పలను ఉంచి, ఇంటింటికీ తిరుగుతూ, పసుపు కుంకుమలు సేకరిస్తూ, విరాళంగా వచ్చిన డబ్బులతో గ్రామ దేవతలైన ముత్యాలమ్మ తల్లి, బొడ్రాయి, శివలింగాలకు నీళ్లతో అభిషేకం చేసి, పసుపు కుంకుమలతో అలంకరించి, ధూప దీప నైవేద్యాలతో కొబ్బరికాయలు కొట్టి, ప్రత్యేక పూజలు చేశారు.

అనంతరం గ్రామంలోని గురువమ్మ తల్లి ఆలయం వద్ద కప్పలకు పెళ్లిళ్లు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మృగశిర కార్తె ప్రవేశించి పది రోజులైనా, ఈపాటికే వర్షాలు కురిసి ,వ్యవసాయ పనులు ప్రారంభం కావలసి ఉన్నా, ఇంకా ఎండ వేడిమి భరించలేకపోతున్నామని, త్వరగా వర్షాలు కురవాలని వరుణ దేవుని ప్రార్థిస్తూ, కప్పలకు పెళ్లి చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో లకావత్ వీరు, బాణోత్ రఘు, అజ్మీర రమేష్ ,అజ్మీర శ్రీను, అజ్మీర దిలీప్, అజ్మీర కిరణ్, అజ్మీర్ నవీన్, బాసు, బాణోత్ సాయి కృష్ణ ,బాణోతు రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News