Sunday, April 28, 2024

నాలుగో రోజూ పెరిగిన పెట్రో ధరలు

- Advertisement -
- Advertisement -

Fuel prices rise for fourth day

అయిదు రోజుల్లో రూ.3.20 పెంపు

న్యూఢిల్లీ: వరసగా నాలుగో రోజు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. శనివారం కూడా చమురు సంస్థలు పెట్రోల్, డీజిల్‌పై లీటరుకు 80 పైసలు పెంచాయి. దీంతో గత అయిదు రోజుల్లో పెట్రోల్, డీజిల్‌పై లీటరుకు రూ.3.20 పెరిగింది. స్థానిక పన్నులతో కలుపుకొంటే ఆయా రాష్ట్రాల్లో ఈ పెరుగుదల మరింత ఎక్కువే ఉంది. తాజా పెంపు తర్వాత ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.96.61కి చేరుకోగా, డీజిల్ ధర 89.87గా ఉంది. అదే ముంబయిలో పెట్రోల్ ధర లీటరుకు రూ. 113.35 కాగా, డీజిల్ ధర రూ.97.55గా ఉంది. ఇక హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్ ధర 111.80కి చేరుకుంది. డీజిల్ ధర రూ. 98.10గా ఉంది. యుపి సహా అయిదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల కారణంగా చమురు కంపెనీలు దాదాపు నాలుగున్నర నెలలు పెట్రోల్, డీజిల్ ధరలను సవరించలేదు.

అయితే రష్యాఉక్రెయిన్ యుద్ధం కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు భారీగా పెరగడంతో చమురు కంపెనీలు నష్టపోవలసి వచ్చింది. ధరలు సవరించకపోవడం వల్ల చమురు కంపెనీలకు దాదాపు 19 వేల కోట్ల రూపాయల నష్టం వచ్చినట్లు మూడీస్ ఇన్వెస్టర్ సర్వీసెస్ గత గురువారం అంచనా వేసింది. ఈ నష్టాన్ని భర్తీ చేసుకోవాలంటే చమురు కంపెనీలు డీజిల్, పెట్రోల్‌పై లీటరుకు సగటున 10 15 రూపాయల దాకా పెంచాల్సి ఉంటుందని నిపుణుల అంచనా. మరో వైపు పెట్రో ధరల పెంపుపై విపక్షాలు ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడుతున్నాయి. ఎన్నికలు ముగియగానే కేంద్రం బాదుడు మొదలు పెట్టిందంటూ విమర్శిస్తున్నాయి. దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలకు కూడా సిద్ధమవుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News