Thursday, May 2, 2024

కోహెడకు గడ్డిఅన్నారం మార్కెట్ తరలింపు

- Advertisement -
- Advertisement -

Gaddi Annaram

 

మనతెలంగాణ, హైదరాబాద్ : ఆసియాలోనే అతి పెద్ద పండ్ల మార్కెట్ కొత్త పేట ప్రాంతంలోని గడ్డిన్నారం మార్కెట్‌ను కొహెడకు తరలించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు బుధవారం అర్దరాత్రి నుంచి ప్రారంభించనున్నారు. దీని తరలింపుకు సంబంధించించి సమాచారాన్ని ఇప్పడికే మార్కెటింగ్ శాఖ అధికారులు రైతులకు అందించారు.బత్తాయి, మామిడి రైతులు ఇక నుంచి ఇక్కడకు పంటను తీసుకురావద్దని, ఈ నెల 27న నుంచి కొత్తగా ప్రారంభం కానున్న కోహెడ మార్కెట్‌ను బత్తాయి మామిడి పంటలను తీసుకు రావాలని అధికారులు తెలిపారు. కరోనా కట్టడిలో భాగంగా మార్కెటను తరలిస్తున్నామని చెబుతున్నప్పటికి గతంలో ఈ మార్కెటను కోహెడకు తరలించాలన్న ప్రతిపాదనలకు ఇప్పుడు కార్యరూపం తెస్తున్నట్లు సమాచారం. బత్తాయి, మామిడి, మినహ, మిగత పండ్ల అమ్మకాలను సరూర్‌నగర రైతుబజార్ వెనుక భాగంగా ఇప్పటికే ప్రారంభించారు.

నగరంలో జాంబాగ్ ఉన్న పండ్ల మార్కెట్‌ను అక్కడ స్థలం అందుబాటులో లేక పోవడంతో నాడు నగర శివారు ప్రాంతంగా ఉన్నటువంటి దిల్‌షుక్‌నగర్ ప్రాంతానికి తరలించేందుకు అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది. ఎక్కువగా రాకపోకలు లేకుండా రద్దీ లేని ఈ ప్రాంతంలో మార్కెట్ ఏర్పాటు చేస్తే పండ్ల లారీల రాకపోకలకు సులువుగా ఉంటుందని నాటి ప్రభుత్వం నిర్ణయించింది. ఎక్కువగ రాక పోకలు లేకుండా రద్దీ లేని ఈ ప్రాంతంలో మార్కెట్ ఏర్పాటుకు చేస్తే పండ్ల లారీలకు సులువుగా ఉంటుందని ఈ ప్రాంతాన్ని ఎంపిక చేశారు.ఈ క్రమంలో నాటి కొత్త పేట గ్రామ పంచాయితీ పరిధిలోని సర్వే నెం 123, 124, 125, 126 ఉన్నటువంటి 22 ఎకరాల భూమిని మార్కెట్‌కు కేటాయించారు. దీంతో 1986లో గడ్డిన్నారం వ్యసాయ మార్కెట్ ఏర్పాటైంది. 22 ఎకరాల సువిశాల స్థలంలో ఆసియాలోనే అతి పెద్ద పండ్ల మార్కెట్‌గా తీర్చిదిద్దారు.

దీంతో జాంబాగ్‌లో వ్యాపారాలు నిర్వహించే 97 మంది కమిషన్ ఏజంట్లను ఇక్కడకు వచ్చి వ్యాపార లావాదేవీలు ప్రారంభించారు. 97మంది కమిషన్ ఏజెంట్లతో ప్రారంభమైన మార్కెట్ దశలవారీగా కమిషన ఏజెంట్లు లైసెన్స్‌లు జారీచేయడంతో ప్రస్తుతం 252 మంది కమిషన్ ఏజెంట్లు క్రయ విక్రయాలు జరుపుతున్నారు. 97 పెద్ద దుకాణాలు77 చిన్నదుకాణాలు నాలుగు ఫ్లాట్ ఫారాల్లో ప్రస్తుతం వ్యాపారం నిర్వహిస్తున్నారు.మార్కెట్ ఆవరణలో ఒక కోల్డ్ స్టోరేజి, రైపింగ్ చాంబర్ , రెండు వే బ్రిడ్జిలు కూడా ఉన్నాయి.ఆన్ లైన్ ఎంట్రి ఇక్కడి ప్రత్యేకత. మార్కెట్‌కు సరుకు తీసుకు వచ్చే ప్రతి వాహనం ముందుగా ప్రవేశ ద్వారం వ్ద వాహనం సరుకు వివరాలను కంప్యూటర్‌లో నమోదు చేసి ఎంట్రి పాస్ ఇచ్చిన తర్వాత వాహనాలను లోపలకు అనుమతిస్తారు.

గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్‌లో సుమారు 2 వేల కుటుంబాలు జీవనోపాది పొందుతున్నాయి. 252 మంది కమిషన్ ఏజెంట్లు, 300 మంది లైసెన్స్‌లు కలిగినటువంటి హామాలీలు,300 మంది గుమస్తాలతో పాటు1500 మంది కూలీలు ప్రతి రోజు మార్కెట్‌లో పని చేస్తుంటారు. సీజన్‌లో మరో ఐదారు వందల మంది కూలీలుగా అదనంగా పని చేస్తారు .గడ్డిన్నారం పండ్ల మార్కెట్‌కు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్నాటక తమిళనాడు, మహారాష్ట్ర ఢిల్లీ, పంజాబ్, హర్యాన, రాష్ట్రాల నుంచి కూడా పండ్లు విక్రయానికి వస్తుంటాయి.ఇక్కడ నుంచి మన దేశంలోని వివిధ రాష్ట్రాలకు కూడా పండ్లు ఎగుమతి అవుతుంటాయి.అయితే ప్రతి రోజు మార్కెట్‌లో సుమారు రూ.10 నుంచి రూ.12 కోట్ల లావాదేవీలు జరుగుతుండటం గమనార్హం. ప్రతి రోజు మార్కెట్‌కు రూ.10 లక్షల ఆదాయం వస్తుంది.

 

Gaddi Annaram Market Moves to Koheda
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News