Thursday, May 2, 2024

రిపబ్లిక్‌డే రోజున గల్వాన్ వీరులకు గ్యాలెంటరీ మెడల్స్

- Advertisement -
- Advertisement -

Gallantry medals for Galwan heroes on Republic Day

 

న్యూఢిల్లీ: తూర్పు లడఖ్‌లోని గల్వాన్ లోయలో చైనా దురాక్రమణను అడ్డుకునేందుకు వీరోచితంగా పోరాడి అమరులైన భారత సైనికులను గణతంత్ర దినోత్సవం రోజున(జనవరి 26న) గ్యాలెంటరీ మెడల్స్‌తో గౌరవించనున్నట్టు తెలుస్తోంది. మరణానంతరం ప్రకటించే ఈ గౌరవ పురస్కారాలను కల్నల్ బి.సంతోష్‌బాబుసహా ఐదుగురు అమర జవాన్లకు ఇవ్వనున్నట్టు అధికారిక వర్గాలు తెలిపాయి. అయితే, ఎంతమందికి అనే విషయాన్ని రక్షణశాఖగానీ, సైనికవర్గాలుగానీ తేల్చి చెప్పలేదు. హిందుస్థాన్ టైమ్స్ ప్రకారం అమరులైన ఇద్దరు అధికారులు, ముగ్గురు జవాన్లకు ఇవ్వనున్నారు. వాస్తవాధీనరేఖ వద్ద పెట్రోలింగ్ పాయింట్ 14ను అతిక్రమించి భారత భూభాగంలోకి చొరపడేందుకు యత్నించిన చైనా దళాల్ని నిలువరిస్తూ ‘16 బీహార్ బెటాలియన్’కు చెందిన 20మంది భారత జవాన్లు గతేడాది జూన్ 15న వీరమరణం పొందిన విషయం తెలిసిందే.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News