Tuesday, May 14, 2024

దేశంలోనే అత్యంత పొడవైన గ్లాస్ బ్రిడ్జి ప్రారంభం

- Advertisement -
- Advertisement -

తిరువనంతపురం: కేరళలోని వాగమన్ పర్యాటక కేంద్రం వద్ద 40 మీటర్ల పొడవైన అద్దం వంతెన(గ్లాస్ బ్రిడ్జి) పర్యాటకులకు బుధవారం నుంచి అందుబాటులోకి వచ్చింది.

దేశంలోనే అత్యంత పొడవైన క్యాంటీలివర్ స్కైవాక్ గ్లాస్ బ్రిడ్జిని కేరళ పర్యాటక మంత్రి ముహమ్మద్ రియాస్ బుధవారం లాంఛనంగా ప్రారంభించారు. సముద్ర మట్టానికి 3,500 అడుగుల ఎత్తున ఉన్న వాగమన్ పర్యాటక కేంద్రం వద్ద నిర్మించిన ఈ గ్లాస్ వంతెన ద్వారా 150 మీటర్ల ఎత్తు నుంచి ప్రకృతి అందాలను ఆస్వాదించవచ్చు.

రూ. 3 కోట్ల ఖర్చుతో ప్రైవేట్ భాగస్వామ్యంలో ఈ గ్లాస్ వంతెనను జిల్లా పర్యాటక శాఖ అధికారులు ఏర్పాటు చేశారు. చుట్టూ ఎత్తయిన పర్వతాలలో కనువిందు చేసే ఈ ప్రాంతంలో పర్యాటకాన్ని ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో పర్యాటక శాఖ ఈ అద్దం వంతెనను ఏర్పాటు చేసింది.

ఏకకాలంలో 15 మంది వ్యక్తులు ఈ వంతెనపైకి వెళ్లవచ్చు. ఒక్కో వ్యక్తికి రూ. 500 టిక్కెట్ ధర ఉంటుంది. 10 నిమిషాల వరకు ఈ ంతెనపై గడపడానికి వీలు ఉంటుంది. ఈ అడ్వెంచర్ పార్కులో ఇంకా స్కై స్వింగ్, స్కై సైక్లింగ్ వంటివి కూడా ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News