Sunday, May 5, 2024

నల్లగొండ హనుమాన్ నగర్ లో లడ్డూ వేలం రూ.11 లక్షలు

- Advertisement -
- Advertisement -

ganesh nimajjanam 2021 date

నల్గొండ : ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఘనంగా గణేష్ నిమజ్జన శోభాయాత్ర ప్రారంభమైంది. నల్గొండ హనుమాన్ నగర్ లోని ఒకటో నంబర్ వినాయకుడి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి శోభా యాత్రను మంత్రి జగదీష్ రెడ్డి ప్రారంభించారు. హనుమాన్ నగర్ ఒకటో నంబర్ గణేష్ లడ్డునూ వేలం పాటలో అత్యధికంగా 11 లక్షల రూపాయలకు వేమ్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి దక్కించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి, ఎస్పి రెమా రాజేశ్వరి, జెడ్పి చైర్మన్ బండ నరేందర్ రెడ్డి, శాంతి కమిటీ సభ్యులు పాల్గొన్నారు.  ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 15 వేల గణేష్ విగ్రహాలు. నిమజ్జనం కానున్నాయి.  నల్గొండలోని అన్ని గణేష్ విగ్రహాలు క్లాక్ టవర్ మీదుగా గణేష్ శోభయాత్ర సాగనుంది.  10-20 అడుగుల పెద్ద విగ్రహాలు దండంపల్లి కాలువ వద్ద, 10 అడుగుల విగ్రహాలు వల్లభరావు చెరువు వద్ద నిమజ్జనం చేసేలా ఏర్పాట్లు చేశారు.  సూర్యాపేటలో మినీ ట్యాంక్ బండ్ వద్ద నిమజ్జనానికి ఏర్పాట్లు చేశారు. గత సంవత్సరం హనుమాన్ నగర్ లో ఆరు లక్షల పదిహేను వేల రూపాయలకు దక్కించుకున్న విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News