Friday, March 1, 2024

‘అరె ఏమైందీ ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికో ఎగిరింది’

- Advertisement -
- Advertisement -

సంతోషంలో సినీ నిర్మాత బండ్ల గణేష్ ట్విట్టర్‌లో పోస్ట్
‘ఇంకా ఫలితాలు రాలేదన్నా… అప్పుడే ఎగరొద్దు’ అంటూ
వెటకారంగా, ఫన్నీగా కామెంట్స్ పెడుతున్న నెటిజన్లు

మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండడంతో ఆ పార్టీ నాయకుడు, సినీ నిర్మాత బండ్ల గణేష్ సంతోషం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ విజయంపై ఆ పార్టీ శ్రేణులు ధీమాగా ఉన్నారని, ఈ నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ వేళ ఆయన సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ అందరినీ ఆకర్షిస్తోంది. ‘అరె ఏమైందీ ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికో ఎగిరింది? హ..హ..హ’ అంటూ బండ్ల గణేష్ ట్విట్టర్‌లో (ఎక్స్)లో పోస్ట్ చేశారు.

ఈ పోస్ట్ పై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇటీవల ఓ న్యూస్ ఛానెల్‌తో మాట్లాడిన బండ్ల గణేష్ డిసెంబర్ 9వ తేదీన ఎల్బీ స్టేడియంకు వస్తారా? అని బండ్ల గణేశ్‌ను మీడియా ప్రతినిధి అడగ్గా ‘తాను మాత్రం 7వ తేదీ నుంచి గాంధీభవన్ వద్దే పడుకుంటానని, మీరు 9వ తేదీన రండి’ అని వెటకారంగా సమాధానం చెప్పారు. బండ్లన్న చెప్పిన సమాధానం బాగా వైరల్ అయ్యింది. ఇప్పుడు దాన్నే నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అయితే, ఎగ్జిట్ పోల్స్ చూసి సంబరపడిపోవద్దు అన్నా.. కాస్త ఓపిక పట్టాలని కొంతమంది బండ్ల గణేశ్‌కు ట్విట్టర్ వేదికగా సూచిస్తున్నారు. ‘ఇంకా ఫలితాలు రాలేదన్నా అప్పుడే ఎగరొద్దు’ అంటూ వెటకారంగా, ఫన్నీగా కామెంట్స్ పెడుతున్నారు. మొత్తం మీద ఎగ్జిట్ పోల్స్ వచ్చిన సమయంలో బండ్లన్న చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News