Saturday, April 27, 2024

ఇలాంటప్పుడు రహానే ఉంటే బాగుండేది: గావస్కర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న తొలి టెస్టుపై టీమిండియా మాజీ ఆటగాడు సునీల్ గావస్కర్ స్పందించారు. తొలి ఇన్నింగ్స్‌లో భారత జట్టు 208 పరుగులు చేయడంతో మంచి స్కోరేనని చెప్పారు. కెఎల్ రాహుల్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడని కొనియాడారు. ఇలాంటి సమయంలో అజింక్య రహానే లాంటి ఆటగాడు ఉండాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. 2018 పర్యటనలో జోహాన్స్ బర్గ్ టెస్టు రహానే ఇన్నింగ్స్‌ గురించి ప్రస్తవించారు.

ఐదు సంవత్సరాల క్రితం జోహాన్స్ బర్గ్ పిచ్ బ్యాటింగ్ చాలా కష్టంగా ఉంది, ఇప్పుడు సెంచూరియన్ పిచ్ లాగానే, కానీ రెండో ఇన్నింగ్స్‌లో రహానే అద్భుతంగా బ్యాటింగ్ గెలుపుకు బాటలు వేశాడని తెలియజేశారు. రెండో ఇన్నింగ్స్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ పరుగులు చేస్తే గెలిచే అవకాశాలు ఉంటాయని వివరించారు. సౌతాఫ్రికా బ్యాట్స్‌మెన్లు ఫామ్‌లో లేకపోవడంతో బౌలింగ్ మంచిగా చేస్తే విజయం సాధించవచ్చని ధీమా వ్యక్తం చేశారు. ఈ మ్యాచ్‌లో కెఎల్ రాహుల్ (70), విరాట్ కోహ్లీ(38), శ్రేయస్ అయ్యర్(38), శార్థూల్ ఠాకూర్(24) పరుగులు చేసి పర్వాలేదనిపించారు. రోహత్ శర్మ(05), శుభ్‌మన్ గిల్(02) పరుగులు చేసి ఘోరంగా విఫలంకాగా యశస్వి జైస్వాల్(17) పరుగులు చేసి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News