Friday, May 10, 2024

కాంగ్రెస్ ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటుంది: రేవంత్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కాంగ్రెస్ ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. రేపటి నుంచి ప్రజాపాలన కార్యక్రమం ఉంటుందని చెప్పారు. ఆరు గ్యారంటీల అభయహస్తం లోగోను సిఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రేవంత్ మీడియాతో మాట్లాడారు. అర్హులందరూ అప్లికేషన్ పెట్టుకోవచ్చని, పేదలకు సంక్షేమ పథకాలు అందించడమే తమ లక్షమని స్పష్టం చేశారు. ప్రజావాణిలో 24 వేల ఫిర్యాదులు వచ్చాయని, ఎక్కువగా భూసమస్యల మీదనే ఫిర్యాదులు వచ్చాయని చెప్పారు. ప్రభుత్వాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసం రావాలన్నారు. మహిళలు, పురుషులకు సపరేట్ కౌంటర్లు ఉంటాయని రేవంత్ రెడ్డి వివరించారు. గతంలో గడీల పాలన ఉండేదని, ఇప్పుడు ప్రజల వద్దకు తీసుకొచ్చానని పేర్కొన్నారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటామన్నారు. లబ్ధిదారుల సంఖ్య ప్రభుత్వం దగ్గరనే ఉంటుందని, గ్రామసభల్లో ఇవ్వలేని వారు పంచాయతీల్లో ఇవ్వవచ్చని సూచించారు. సెక్రటేరియట్ లో మీడియా హాల్ ఉంటుందని రేవంత్ రెడ్డి చెప్పారు. ప్రతి మండలంలో రెండు గ్రూపులు ఏర్పాటు చేస్తామని, ఒక గ్రూపుకు ఎంఆర్ఒ, మరొక గ్రూప్ కు ఎండిఒ నాయకత్వం వహిస్తారని తెలియజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News