Thursday, May 2, 2024

నవంబర్ 1న గ్లిమ్స్

- Advertisement -
- Advertisement -

Glimpses from ‘RRR’ on November 1st

ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులందరూ ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆశగా ఎదురుచూస్తోన్న చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్’. దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో రామ్‌చరణ్, తారక్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇందులో కొమురంభీమ్ పాత్రలో తారక్.. అల్లూరి సీతారామరాజుగా చెర్రీ కనిపించనున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ స్పెషల్ అప్‌డేట్ ఇప్పుడు సినీ ప్రియుల్లో ఆనందాన్ని నింపుతోంది. నవంబర్ 1న ‘ఆర్‌ఆర్‌ఆర్’ నుంచి ఓ గ్లిమ్స్ బయటకు రానుంది. 45 సెకన్ల నిడివితో రానున్న ఈ వీడియోలో చరణ్-, తారక్ కలిసి కనిపించే అవకాశం ఉందని సమాచారం. మరోవైపు ఇప్పటికే విడుదలైన ‘భీమ్ ఫర్ రామరాజు’, ‘రామరాజు ఫర్ భీమ్’ వీడియోలు ప్రేక్షకులను ఎంతగానో మెప్పించినప్పటికీ… వాటిల్లో తారక్-, చరణ్ ఒకే ఫ్రేమ్‌లో కనిపించలేదు. రూ.450 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమా నిర్మితమవుతోంది. అలియాభట్, ఒలీవియా మోరీస్ కథానాయికలు. అజయ్ దేవ్‌గణ్, శ్రియ, సముద్రఖని తదితరులు ఈ సినిమాలో కీలకపాత్రలు పోషిస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News