Thursday, May 2, 2024

రేపటి నుంచి టి సాట్‌లో జీమాట్ స్పెషల్ క్లాసులు

- Advertisement -
- Advertisement -

GMAT special classes in T-SAT from tomorrow

 

మనతెలంగాణ/హైదరాబాద్ : టి-సాట్ నెట్‌వర్క్ ఛానళ్లలో సోమవారం నుంచి జీ-మ్యాట్ (గ్యాడ్యుయేట్ మేనేజ్ మెంట్ అడ్మిషన్ టెస్ట్)పై స్పెషల్ క్లాసులు ప్రసారం చేస్తున్నట్లు సిఇఒ ఆర్.శైలేష్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. టి -సాట్ విద్య ఛానల్‌లో సోమవారం రాత్రి 9.30 నుండి 10 గంటల వరకు, మరుసటి రోజు ఉదయం నిపుణ ఛానల్‌లో 8:30 నుండి 9:00 గంటల వరకు అరగంట పున:ప్రసారాలు ఉంటాయని వివరించారు. ఇప్పటి వరకు ప్రాథమిక, ఉన్నత, ఇంటర్మీడియట్, డిగ్రీ, ఇంజనీరింగ్ విద్యార్థులకు పాఠ్యాంశాలు ప్రసారం చేసిన టి- సాట్ ప్రస్తుతం బిజినెస్ పాఠశాలల విద్యార్థులకూ పాఠ్యాంశ ప్రసారాలు అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.

జి-మ్యాట్ ప్రసారాల్లో భాగంగా క్యాంటిటేటివ్ అప్టిట్యూడ్ అంశంపై సోమవారం ప్రసారమయ్యే ప్రసారాలు మొదటి విడతలో 30 రోజులు కొనసాగనున్నాయని, వీటిని గ్రాడ్యుయేట్, పోస్టు గ్య్రాడ్యుయేట్ స్టూడెంట్స్ వినియోగించుకోవచ్చని పేర్కొన్నారు. ప్రధానంగా ఐ.ఎస్.బి,ఐ.ఐ.ఎం., ఎస్.బి.జైన్ వంటి ప్రత్యేక బిజినెస్ స్కూల్ పాఠశాలల్లో ప్రవేశించే విద్యార్థులకు టి- సాట్ ప్రసారం చేసే పాఠ్యాంశాలు ప్రయోజనం చేకూర్చుతాయన్నారు. తెలంగాణ, భారతదేశంలో చదివే విద్యార్థులే కాకుండా విదేశాల్లో చదివే విద్యార్థులూ వీటిని అనుసరించి పోటీ పరీక్షల్లో తమ తమ ర్యాంకింగ్స్‌ను మెరుగు పరుచుకునేందుకు జి-మ్యాట్ ప్రసారాలు ఉపయోగపడాయని సూచించారు. ఆంగ్ల బోధనలో జరిగే ప్రసారాలు టి-సాట్ నెట్వర్క్ ఛానళ్లతో పాటు టి-సాట్ వెబ్‌సైట్, ఫేస్‌బుక్, యాప్, యాప్ ప్లే స్టోర్, యూట్యూబ్‌లో ప్రసారాలు అందుబాటులో ఉంటాయని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News