Wednesday, May 22, 2024

అన్‌సెక్యూర్డ్ వ్యాపార రుణాలను అందిస్తోన్న గోద్రెజ్ క్యాపిటల్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: గోద్రెజ్ గ్రూప్ యొక్క ఆర్థిక సేవల విభాగం అయిన గోద్రెజ్ క్యాపిటల్, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (MSMEలు) కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన అన్‌సెక్యూర్డ్ బిజినెస్ లోన్‌లను అందించనున్నట్లు ప్రకటించింది. ఈ వ్యాపారాలు ఎదుర్కొంటున్న సవాళ్లను గుర్తిస్తూ, గోద్రెజ్ క్యాపిటల్ వినూత్నమైన, సౌకర్యవంతమైన రీపేమెంట్ అవకాశాలను అందించడం ద్వారా నగదు ప్రవాహ నిర్వహణ యొక్క వారి ప్రత్యేక అవసరాలను తీర్చే ఫైనాన్సింగ్ ఎంపికలను అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

పూర్తి డిజిటలైజ్డ్ ప్రాసెస్, వేగవంతంగా మంజూరు చేయటం, రుణాలను అందించటం, 60 నెలల వరకు చెల్లించే అవకాశం, సకాలంలో తిరిగి చెల్లింపులపై పరిశ్రమలో మొట్ట మొదటి రివార్డ్ ప్రోగ్రామ్‌తో సహా అనేక ఇతర ప్రయోజనాలను కూడా అందిస్తుంది.గోద్రేజ్ క్యాపిటల్ ముంబై, బెంగుళూరు, ఢిల్లీ-ఎన్ సిఆర్, పూణె, అహ్మదాబాద్, సూరత్, ఇండోర్, చెన్నై, హైదరాబాద్, జైపూర్, చండీగఢ్, అల్వార్, ఔరంగాబాద్, బరోడా, కోయంబత్తూర్, జలంధర్, జోధ్‌పూర్, కాంచీపురం, మంగళూరు, సేలం, లూథియానా, మైసూర్, నాగ్‌పూర్, నాసిక్, రాజ్‌కోట్, ఉదయ్‌పూర్, వాపి, విజయవాడ, రంగారెడ్డి, విశాఖపట్నం, థానే అంతటా ఈ వ్యాపార రుణాలను అందిస్తోంది.

“ఎంఎస్‌ఎంఈలు ఎదుర్కొంటున్న సవాళ్లను, ఆర్థిక వృద్ధిని నడిపించడంలో వారి కీలక పాత్రను మేము అర్థం చేసుకున్నాము. అన్‌సెక్యూర్డ్ వ్యాపార రుణాల ద్వారా మా ఉత్పత్తి ఆఫర్‌లను విస్తరించడం సంతోషంగా ఉంది. మేము ఇప్పుడు 31 కీలక మార్కెట్‌లలో వ్యాపార రుణాలను అందిస్తున్నాము. ’’అని గోద్రెజ్ క్యాపిటల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మనీష్ షా అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News