Sunday, April 28, 2024

దేశం గర్వించదగ్గ పివికి కూతురుగా పుట్టడం నా అదృష్టం: వాణీదేవి

- Advertisement -
- Advertisement -

Good fortune to be born pv daughter of a country proud

హైదరాబాద్: దేశం గర్వించదగ్గ దివంగత మాజీ ప్రధాని పివి నరసింహా రావుకు కూతురుగా పుట్టడం తనకు అదృష్టమని టిఆర్‌ఎస్ ఎంఎల్‌సి అభ్యర్థి వాణీదేవి తెలిపారు. దోమలగూడలోని పింగళి వెంకటరామిరెడ్డి హాల్‌లో సమన్వయ సమ్మేళనంలో పివి వాణిదేవి మాట్లాడారు. పివి నర్సింహారావు గురించి ఎంత చెప్పినా తక్కువే అని అన్నారు. పివి లాంటి మహానుభావుడి కూతురిగా ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించండన్నారు. ధర్మ మార్గంలోనూ ప్రజలకు సేవ చేయొచ్చని నిరూపిస్తామన్నారు. ఈ కార్యక్రమానికి మంత్రి కెటిఆర్, ప్రభుత్వ సలహాదారు కెవి రమణాచారి, ఎంపి కెప్లెన్ లక్ష్మీ కాంతారావు, వక్ఫ్ బోర్డు చైర్మన్ సలీమ్, ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలచారి, ఎంఎల్‌సి పురాణం సతీష్, ఎంఎల్‌ఎ ముఠా గోపాల్ పాల్గొన్నారు. వేద పండితులు మంత్రి కెటిఆర్‌కు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News