Wednesday, May 1, 2024

కులవృత్తులను ఆదుకునేందుకు ప్రభుత్వం కృషి

- Advertisement -
- Advertisement -

సూర్యాపేట: కులవృత్తులను ఆదుకునేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. శుక్రవారం కోదాడ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

పశు సంపద అభివృద్ధితో పాటు గొర్రెల పెంపకదారుల జీవితాలల్లో ప్రభుత్వం వెలుగులు నింపుతుందని అన్నారు. స్వయం ఉపాధి కల్పన ప్ర భు త్వం లక్షమని ఆయన అన్నారు. సిఎం కెసిఆర్ నాయకత్వంలో మార్గదర్శకంలో గొల్ల కురుమల ఆర్థికాభివృద్ధికి గొ ర్రెల పంపిణీ పథకం అని ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఆర్డిఓ కిషోర్‌కుమార్, ఎంపిపి చింతా కవిత రాధారెడ్డి, యా తాలకుల జ్యోతి మధుబాబు, సొసైటీ ఛైర్మన్ ఆవుల రామారావు, వెటర్నరీ జిల్లా అధికారి శ్రీనివాసరావు, డాక్టర్లు నా గేంద్ర బాబు, అఖిల, రవికుమార్, సురేంద్ర, ఆయా గ్రామాల సర్పంచ్‌లు,ఎంపిటిసిలు, బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు, యాదవ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News