Friday, May 3, 2024

తెలంగాణ గౌరవ ప్రతీక బతుకమ్మ: గవర్నర్ తమిళిసై

- Advertisement -
- Advertisement -

Governor Tamilisai Distributed Bathukamma Sarees

హైదరాబాద్: తెలంగాణ సంప్రదాయ, సాంస్కృతిక వైభవానికి బతుకమ్మ ప్రతీకని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. శుక్రవారం రాజ్‌భవన్‌లో మహిళలకు గవర్నర్ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ తెలంగాణ ఆడబిడ్డలు బతుకమ్మ పండుగను ప్రకృతితో, దైవంతో, పుట్టిన గడ్డతో మమేకయ్యేలా ఈ వేడుకలను జరుపుకుంటారని ఆమె పేర్కొన్నారు. ఈ పండుగ సందర్భంగా ఆడబిడ్డలు ఇచ్చుపుచ్చుకునే నైవేద్యాలు ఆరోగ్యకరమైనవని, బలవర్ధకమైనవన్నారు. పండుగ సందర్భంగా వీటి పంపిణీ ద్వారా మహిళల్లో పోషకత, ఆరోగ్యం పెంపొందుతుందన్నారు. బతుకమ్మ కోసం వాడే పూలలో ఔషధ గుణాలుంటాయని, వాటి నిమజ్జనం ద్వారా చెరువుల్లోని నీరు శుద్ధి అవుతుందన్నారు. తాను గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మొట్టమొదటి సారిగా రాజ్‌భవన్‌లో బతుకమ్మ సంబురాలు గత సంవత్సరం నుంచి ప్రారంభించానని, తెలంగాణ సోదరిగా ఒక ఆడబిడ్డగా తనకు ఇది ఎంతో సంతృప్తిని ఇచ్చిందని ఆమె తెలిపారు. వచ్చే సంవత్సరం కోవిడ్ 19 పూర్తిస్థాయిలో అదుపులోకి వస్తే బతుకమ్మను ఘనంగా జరుపుకుందామని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ సురేంద్రమోహన్, జాయింట్ సెక్రటరీ జె.భవానీ శంకర్, రఘుప్రసాద్, ఇతర అధికారులు, మహిళలు పాల్గొన్నారు.

Governor Tamilisai Distributed Bathukamma Sarees

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News