Thursday, May 2, 2024

తమిళనాడు అసెంబ్లీలో గవర్నర్ వివాదాస్పద వ్యాఖ్యలు

- Advertisement -
- Advertisement -

ప్రసంగ పాఠం చదవకుండానే నిష్క్రమణ

చెన్నై: తమిళనాడు గవర్నర్ ఆర్‌ఎన్ రవి మరోసారి రాష్ట్రంలోని డిఎంకె ప్రభుత్వంపై తన ఘర్షణ వైఖరిని ప్రదర్శించారు. రాష్ట్ర బెడ్జట్ సమావేశాల తొలి రోజు సోమవారం తన సాంప్రదాయ ప్రసంగ పాఠంలోని కొన్ని అంశాలపై అభ్యంతరాలు లేవనెత్తుతూ ప్రసంగం ప్రారంభించిన కొద్ది నిమిషాలకే అర్థంతరంగా ముగించి సభ నుంచి ఆయన నిష్క్రమించారు. యన వ్యాఖ్యలను శాసనసభ స్పీకర్ రికార్డుల నుంచి తొలగించడం విశేషం. అనంతరం రాజ్‌భవన్ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. గవర్నర్ ప్రసంగానికి ముందు, తరువాత జాతీయ గీతాలాపన జరగాలన్న గవర్నర్ సూచనను డిఎంకె ప్రభుత్వం పెడచెవిన పెట్టిందంటూ రాజ్‌భవన్ ఆరోపించింది.

గవర్నర్‌పై అసెంబ్లీ స్పీకర్ సభలో విమర్శలు గుప్పించారని, నాథూరాం గాడ్సే అనుచరుడంటూ గవర్నర్‌పై ఆరోపణలు చేశారని, ఈ కారణంగానే గవర్నర్ పదవిపై గౌరవంతో సభ నుంచి గవర్నర్ రవి నిష్క్రమించారని వివరించింది. రాష్ట్రానికి వరద సహాయంపై స్పీకర్ అప్పవు కొన్ని వ్యాఖ్యలు చేసిన దరిమిలా గవర్నర్ సభ నుంచి వెళ్లిపోయారు.

ఈ రోజుకు సభాకార్యకలాపాల ముగింపునకు సూచనగా జాతీయ గీతలాపాన కోసం ఆయన ఎదురుచూడలేదు. బడ్జెట్ సమావేశాల ప్రారంభం రోజున గర్నర్ తన ప్రసంగ పాఠాన్ని చదవకుండా సభ నుంచి అర్ధంతరంగా వెళ్లిపోవడం తమిళనాడు అసెంబ్లీ చరిత్రలో ఇదే మొదటిసారి. గత ఏడాది జనవరి 9న తన ప్రసంగ పాఠంలో కొన్నింటిని వదిలివేసి కొన్ని వ్యాఖ్యలను అదనంగా గవర్నర్ రవి చేర్చడం వివాదాస్పదమైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News