Thursday, May 2, 2024

ఈ నెల 7 నుంచి విదేశాల నుండి భారతీయుల తరలింపు

- Advertisement -
- Advertisement -

Kishan-reddy

 

హైదరాబాద్ : కరోనా మహమ్మారి నేపథ్యంలో విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను మన దేశానికి చేర్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రపంచంలోనే అతిపెద్ద తరలింపు కార్యక్రమాన్ని చేపట్టనుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి. కిషన్‌రెడ్డి తెలిపారు. మొదటి గల్ఫ్ యుద్ధం తరువాత మళ్ళీ ఇదే అతిపెద్ద తరలింపు కార్యక్రమం అని ఆయన అభివర్ణించారు. ఇందుకోసం ఈ నెల 7వ తేదీ నుండి విమానాలు, నౌకల ద్వారా విదేశాల నుండి భారతీయులను తరలించే కార్యక్రమం మొదలవుతుందన్నారు. ఇప్పటికే మొత్తం 1,90,000 మంది భారతీయులు ఆయా దేశాల్లో ఉన్న రాయబార కార్యాలయాల్లో, హైకమీషన్ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకున్నారని పేర్కొన్నారు.

మొదటి దశలో వాయు మార్గాన 13 దేశాలనుండి 14,800 మందిభారతీయులను 64 విమానాల్లో భారత్ కు తీసుకురానున్నామని బుధవారం నాడు విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆయన తెలిపారు. మొదటి దశలో అమెరికా, బ్రిటన్, సింగపూర్, ఫిలిపైన్స్, బంగ్లాదేశ్, యుకె, యుఎఇ, సౌదీ, ఖతార్, ఒమాన్, బహ్రెయిన్ వంటి 12 దేశాలకు భారత విమానాలు చేరుకొని అక్కడున్న భారతీయులను తిరిగి తీసుకువస్తాయని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. సామాజిక దూరాన్ని పాటించే విధంగా ఒక్కో విమానంలో 200 నుండి 300 మందిని తీసుకువస్తామన్నారు.

ప్రాధాన్యత క్రమం కింద భారత్‌కు తరలించే వారిలో
1. ఆయా దేశాల నుండి వెలి వేయబడినవారు
2. వీసా గడువు ముగిసినవారు
3. వలస కార్మికులు
4. ఆరోగ్యరీత్యా భారత్ లోని ఆసుపత్రుల్లో అత్యవసర చికిత్స అవసరమైనవారు
5. గర్భిణీ స్త్రీలు
6. భారత్ లో చనిపోయిన వారి బంధువులు
7. ఆయా దేశాల్లో చిక్కుకున్న పర్యాటకులు
8. విదేశాల్లో హాస్టల్లు మూతబడి ఇబ్బందులు ఎదుర్కుంటున్న విద్యార్థులు భారత్ కు రాదల్చుకున్న వారికి కరోనా పరీక్షలు నిర్వహించబడి సర్టిఫికెట్ పొంది ఉండాలన్నారు. వారు భారత్ కు చేరుకున్న తర్వాత కూడా పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఈ రకంగా విదేశాల నుండి వచ్చిన ప్రతి వ్యక్తి 14 రోజుల పాటు క్వారంటైన్ కు వెళ్లాల్సి ఉంటుందన్నారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు క్వారంటెన్ కేంద్రాలను నిర్వహిస్తాయని తెలిపారు. అదే విధంగా రక్షణశాఖ ఆధ్వర్యంలోని నౌకల ద్వారా కొన్నిదేశాల నుండి మన దేశస్థులను తీసుకువచ్చే కార్యక్రమం మన భారత ప్రభుత్వం అధ్వర్యంలో కొనసాగనుందన్నారు.

Govt bring Indians stranded abroad due to Corona
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News