Saturday, May 4, 2024

కొవిడ్19 బాధితులు అధికంగా ఉండే దేశాల్లో ఆఫ్ఘనిస్తాన్

- Advertisement -
- Advertisement -

Afghanistan

 

ఐక్యరాజ్యసమితి: ప్రపంచంలోనే కొవిడ్19 బాధితుల రేట్ అధికంగా ఉండే దేశాల్లో ఆఫ్ఘనిస్తాన్ ఒకటని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్(ఐవోఎం) ఆందోళన వ్యక్తం చేసింది. మే 5 వరకల్లా ఆ దేశంలో 2900 కేసులు నమోదు కాగా, 90
మంది మరణించారు. తగిన వైద్య సదుపాయాలు లేనందున మూడున్నర కోట్ల తమ దేశ జనాభాలో దాదాపు 80 శాతం కరోనా బారిన పడే ప్రమాదమున్నదని ఆఫ్ఘన్ అధికారులు ఆందోళన చెందుతున్నారు. 50 లక్షలకుపైగా జనాభా ఉన్న కాబూల్‌లో 500మందికి ర్యాండమ్ టెస్ట్ నిర్వహించగా, 50 శాతం మంది ఇన్‌ఫెక్షన్‌కు గురైనట్టు తేలిందని ఐవోఎం తెలిపింది.

ఆఫ్ఘనిస్తాన్‌లో కొవిడ్19 పరీక్షలకు ఏర్పాటైన ఏంద్రాలు 8 మాత్రమే. వీటిలో రోజుకు 100 నుంచి 150 మందికి మాత్రమే పరీక్షలు నిర్వహించే వీలున్నది. ఉగ్రవాదుల ప్రభావం వల్ల ఆఫ్ఘన్‌లోని ౩౦ శాతం ప్రాంతాల్లో పరీక్షలు నిర్వహించేందుకే అవకాశం లేదు. ఆఫ్ఘనిస్తాన్ ప్రజల సగటు ఆయుర్దాయం 50 ఏండ్లు మాత్రమే. టీబీ, హెచ్‌ఐవి, పౌష్టికాహార లోపం, క్యాన్సర్, గుండె, శ్వాస సంబంధ వ్యాధులు ఆ దేశ ప్రజల్ని పీడిస్తున్నాయి. ఆఫ్ఘన్‌లో నిరంతర అంతరుద్ధాల వల్ల ఇప్పటికే లక్షలాదిమంది పొరుగు దేశాల్లో తలదాచుకుంటున్నారు. ప్రస్తుతం కరోనా వల్ల శరణార్థుల్ని తమ సొంత దేశాలకు పంపించడంపై అంతర్జాతీయంగా ఆంక్షలున్నాయి. అయితే, ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటికే ఇరాన్, పాకిస్థాన్‌ల నుంచి 2,71,000మంది ఆఫ్ఘన్‌కు చేరుకున్నారు. వీరి ద్వారా కరోనా వాపిస్తుందన్న ఆందోళన కూడా ఆ దేశ అధికారుల్లో నెలకొన్నది.

Afghanistan one of highest COVID-19 infection rates
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News