Friday, May 3, 2024

కరోనా కొమ్ముల్లోని కొద్ది భాగమే వ్యాధి వ్యాప్తికి కారణం

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: కరోనావైరస్ పైన కొమ్ములవంటి ప్రొటీను నిర్మాణం ఉంటుందని, ఈ వైరస్ మనుషులలో రక్తపోటు కలిగించే ఎంజైమ్-2 గ్రాహకంగా మారుతుందని హైదరాబాద్ యూనివర్సిటీ ప్రొఫెసర్ లలితా గురుప్రసాద్ వెల్లడించారు. హైదరాబాద్ కేంద్ర విశ్వవిద్యాలయంలో కెమిస్ట్రీ విభాగంలో ప్రొఫెసర్‌గా పనిచేసిన లలితా గురుప్రసాద్ ఈ విషయంపై లోతైన పరిశోధనలు చేసి ఇటీవల కొన్ని విషయాలను వెలుగులోకి తీసుకువచ్చారు. గబ్బిలాలు, ఇసవెట్, మనుషులు, మనుషులలోని కరోనావైరస్ పూర్తి జీనోమ్ వరుసను పరిశోధించి ముఖ్యమైన అంశాలను ఆమె గుర్తించారు. ఇటువంటి నిర్మాణం, గబ్బిలాలకు సోకిన వైరస్‌లో లేదని, అందువల్ల ఇప్పటివరకు మనుషులకు సోకుతున్న కరోనా వైరస్‌కు, గబ్బిలాలు కారణం కాదని తేల్చిచెప్పారు. కరోనా కొమ్ముల్లోని కొద్ది భాగమే వ్యాధి వ్యాప్తికి కారణమవుతుందని వెల్లడించారు. కరోనా వైరస్ పొందుతున్న ఉత్పరివర్తనలే దాని అధిక వ్యాప్తికి కారణమవుతోందని తెలిపారు. మనుషులకు సోకుతున్న కరోనా వైరస్‌లోని ఈ ప్రత్యేత లక్షణాలు, రూపాకృతి, నిర్మాణాలను దృష్టిలో ఉంచుకుని రోగనిరోధక వ్యవస్థను రూపకల్పనచేసే పరిశోనధనలు సాగాలని పేర్కొన్నారు. కొన్ని జాతుల గబ్బిలాలకు సోకిన కరోనా వైరష్ పొందే ఉత్పరివర్తనల ద్వారా, భవిష్యత్తులో వీటి నుంచి మనుషులకు కీడు కలిగే అవకాశాలు లేకపోలేదని తమ పరిశోధనలో తేలిందని వెల్లడించారు.

small part of corona to spread disease: HCU Professor

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News