Tuesday, May 7, 2024

అవినీతి లేకుండా నిజాయితీగా సేవలందించాలి: సత్యనారాయణ

- Advertisement -
- Advertisement -

Govt employees do not corruption

కరీంనగర్: ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రవేశ పెట్టిన  నూతన మున్సిపల్ చట్టాన్ని అనుసరించి ప్రజలకు సేవలందించాలని అధికారులకు సిడిఎంఎ అధికారి సత్యనారాయణ సూచించారు.  కరీంనగర్ నగరంలో కమీషనర్ & డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అధికారి సత్యనారాయణ పర్యటించారు.  నగరంలోని ఎల్ఎండి నర్సరీ పట్టణ ప్రకృతి వనం, అల్కాపురి పార్కును సందర్శించారు. కలెక్టరెట్ కార్యాలయంలో  జిల్లా కలెక్టర్ శశాంక్,  మేయర్ సునీల్ రావు, కమీషనర్ క్రాంతి తో కలిసి జిల్లాలోని మున్సిపల్ చైర్మన్లు, కమీషనర్లు, నగరపాలక సంస్థ పలు విభాగాల అధికారులతో సమీక్షా సమావేశ నిర్వహించారు. మున్సిపల్ సమస్యలు, పట్టణ ప్రగతి, హరితహారం అంశాల పై సూదీర్ఘంగా చర్చలు జరిపారు. ఈ సమావేశంలో సత్యనారాయణ మాట్లాడారు. మున్సిపల్ సమస్యల పై సలహాలు సూచనలు చేస్తూ… పట్టణ ప్రగతి, హారితహారం కార్యక్రమాల పై ఆదేశాలు జారీ చేశారు.  దృష్టికి తెచ్చిన అసెస్ మెంట్, మ్యూటేషన్, టిఎస్ బిపాస్, భవన నిర్మాణ అనుమతులు తదితర అన్ని సమస్యలను పరిష్కరిస్తామన్నారు. పట్టణ ప్రగతి ద్వారా ప్రజల సమస్యలు పరిష్కరించడంతో డివిజన్ల, వార్డులలో ప్రగతి సాధించాలని సూచించారు. హరితహారంలో పెద్ద సంఖ్యలో వివిద రకాల మొక్కలు నాటి హరిత పట్టణాలుగా మార్చాలన్నారు. అన్ని పట్టణాల్లో వారం రోజుల్లో మొక్కలు నాటడంతో పాటు సంరక్షించాలని,  నర్సరీలు, ప్రకృతి వనాలను పెంచాలని,  నాటిన, పంపిణీ చసిన మొక్కలకు రిజిస్టర్ చేయించాలన్నారు.

చింతచెట్లు, వివిద రకాల ఔషధ మొక్కలు, మున్సిపల్ కి ఆదాయం పెంచే శ్రీగంధం, టేకు, ఎర్రచందనం, బాంబో లాంటి మొక్కలు నాటడం పై దృష్ఠి పెట్టాలన్నారు.  ఎవేన్యూ, మియావాకీ, బ్లాక్ ప్లాంటేషన్ తో పాటు డెన్స్ ప్లాంటేషన్ పై ప్రత్యేక దృష్టి పెట్టి మొక్కలు నాటాలని,  ప్లాంటేషన్ చేసిన ప్రదేశాల్లో డ్రిస్పిరిగేషన్ ఉండేలా చూడాలన్నారు.  పట్టణ ప్రగతి ద్వారా పట్టణానికి నలు దిక్కులలో ఉన్న వైకుంఠదామాలను అభివృద్ది చేస్కోవడంతో పాటు  పార్కులను సుందరీకరించుకోవాలని సత్యనారాయణ తెలియజేశారు.  ఇంటిగ్రేడెడ్ వెజ్ ఆండ్ నాన్ వెజ్ మార్కెట్లను నిర్మాణం చేసుకోవాలని, పబ్లిక్ హెల్త్ వర్కర్లకు పనిముట్లు అందించడంతో పాటు వారికి డ్రెస్ కోడ్ ఆఫ్రాన్స్ ధరించేలా చూడాలని,  ప్రతి కార్మికునికి ఆరోగ్య రక్షణ పట్ల శ్రద్ద వహించాలని,  వారికి పిపిఇ కిట్స్ అందజేయాలని, ప్రతి నెల పబ్లిక్ హెల్త్ వర్కర్లకు 1 నుండి 5 వ తేదీ లోగా జీతాలు చెల్లింపులు జరగాలన్నారు. పట్టణ ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు ప్రతి ఉద్యోగి పనిచేయాలని, అవినీతికి పాల్పడకుండా నిజాయితిగా విధులు నిర్వర్తించాలన్నారు. ప్రజలకు సేవలందించడంలో అధికారులు, ఉద్యోగులు ఎలాంటి అవినీతికి పాల్పడితే ఉపేక్షించేదే లేదని హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News