Sunday, April 28, 2024

ఎన్‌ఎఫ్‌ఆర్‌లో 5636 అప్రెంటీస్ ఖాళీలు..

- Advertisement -
- Advertisement -

Couple cheating For giving railway jobs
భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వశాఖకు చెందిన అసోం ప్రధానకేంద్రంగా ఉన్న నార్త్‌ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే (ఎన్‌ఎఫ్‌ఆర్)కు చెందిన రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (ఆర్‌ఆర్‌సి) కింది అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ట్రేడ్ అప్రెంటిస్‌లు ఖాళీలు: 5636
ట్రేడులు: వెల్డర్, ఫిట్టర్, డిజిల్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, లైన్‌మెన్, కార్పెంటర్, ప్లంబర్, మాసన్. పెయింటర్…
అర్హత: 10+2 విధానంలో కనీసం 50 శాతం మార్కులతో పదో తరగతో పాటు సంబంధిత ట్రేడుల్లో ఐటిఐ ఉత్తీర్ణత.
వయసు: 1.04.2022 నాటికి 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: పదోతరగతి, ఐటిఐలో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా చేయాలి.
చివరితేది: 30.06.2022.
వెబ్‌సైట్: https://nfr.indianrailways.gov.in/

ఇండియన్ నేవీలో 338 అప్రెంటీస్ ఖాళీలు:

ముంబయిలోని నేవల్ డాక్‌యార్డ్.. డాక్‌యార్డ్ అప్రెంటీస్ స్కూల్‌లో అప్రెంటిస్‌షిప్ శిక్షణలో భాగంగా వివిధ ట్రేడుల్లో చేరేందుకు ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతోంది.
అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ ట్రేడ్ పోస్టులు:
ఎలక్ట్రీషియన్ 49
ఎలక్ట్రోప్లేటర్ 1
మెరైన్ ఇంజిన్ ఫిట్టర్ 36
నమూనా మేకర్ 8
మెషినిస్ట్ 15
మెకానిక్ మెషిన్ టూల్ మెయింటెనెన్స్ 15
పెయింటర్ 11
షీట్ మెటల్ వర్కర్ ౩
పైప్ ఫిట్టర్ 22
మెకానిక్ (ఏసీ,రిఫ్రిజరేటర్)8
టైలర్ (జనరల్)4
వెల్టర్ (గ్యాస్, ఎలక్ట్రిక్)23
ఎలక్ట్రానిక్స్ మెకానిక్ 28
షిప్‌రైట్ వుడ్21
ఫిట్టర్ 5
మేసన్ బిల్టింగ్ కన్‌స్ట్రక్టర్ 8
ఐ అండ్ సీటీఎస్‌ఎం ౩
షిప్‌రైట్ స్టీల్ 20
రిగ్గర్ 14
ఫోర్జర్, హీట్ ట్రీటర్1
అర్హత : పదోతరగతి, ఐటీఐ..సంబంధిత ట్రేడులో ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 1.08.2001 నుంచి 31.10.2008 మధ్య జన్మించినవారు అర్హులు.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభతేది: 21.06.2022
చివరితేది: 8.07.2022
పరీక్షతేది: ఆగస్టు 2022.
వెబ్‌సైట్: https://indiannavy.nic.in/

ఎన్‌పిసిఐఎల్‌లో 117 ట్రేడ్ అప్రెంటిస్‌లు:
భారత ప్రభుత్వరంగ సంస్థ న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్‌పీసీఐఎల్)కు చెందిన కాక్రపార గుజరాత్ సైట్ వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తికి దరఖాస్తులు కోరుతోంది.
ట్రేడ్ అప్రెంటిస్‌లు మొత్తం ఖాళీలు: 117
శిక్షణ వ్యవధి: ఏడాది
ట్రేడులు: ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, ఇనుస్ట్రుఉమెంట్ మెకానిక్, ఎలక్ట్రానిక్ మెకానిక్, కోపా, వెల్డర్, టర్సర్, మెషినిస్ట్, రిఫ్రిజిరేషన్ అండ్ ఏసీ మెకానిక్.
అర్హత: సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణత ఉండాలి.
వయసు: 15.07.2022 నాటికి 14 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: ఐటిఐలో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు సమర్పించాలి.
చివరితేది: 15.07.2022
అడ్రెస్: డిప్యూటీ మేనేజర్ (హెచ్‌ఆర్‌ఎం), న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, కాక్రపార గుజరాత్ సైట్, గుజరాత్ 394651.
వెబ్‌సైట్: https://npcil.nic.in

సిఎస్‌ఐఆర్ మద్రాస్ కాంప్లెక్స్‌లో అప్రెంటిస్‌లు:
చెన్నైలోని సిఎస్‌ఐఆర్ మంద్రాస్ కాంప్లెక్స్‌లో వివిధ విభాగాల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
టెక్నీషియన్ అప్రెంటిస్ విభాగాలు:
కంప్యూటర్ సైన్
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ
సివిల్ ఇంజినీరింగ్
ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణత ఉండాలి. 2020/21/22లో ఉత్తీర్ణులైన డిప్లొమా గ్రాడ్యుయేట్స్ మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం: వాక్‌ఇన్ ఇంటర్వూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
వాక్‌ఇన్‌తేది: 27.06.2022.
వెన్యూ: సీఎస్‌ఐఆర్ మద్రాస్ కాంప్లెక్స్, సీఎస్‌ఐఆర్ రోడ్, తారామణి, చెన్నై–600113.
వెబ్‌సైట్: https://www.csircmc.res.in/

ఎస్‌ఈసీఆర్‌లో 465 ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీలు:
భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వశాఖకు చెందిన బిలాస్‌పూర్ ప్రధాన కేంద్రంగా ఉన్న సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే (ఎస్‌ఈసీఆర్) వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ట్రేడ్ అప్రెంటిస్‌లు: 465
ట్రేడులు: డ్రాఫ్ట్‌మెన్ (సివిల్), ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, మెషినిస్ట్, ప్లంబర్, టర్నర్, వెల్డర్, ఫైర్‌మెన్…
అర్హత: 10+2 విధానంలో పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడుల్లో ఐటిఐ ఉత్తీర్ణత.
వయసు: 1.07.2022 నాటికి 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: పదోతరగతి, ఐటిఐలో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి.
చివరితేది: 22.06.2022.
వెబ్‌సైట్: https://secr.indianrailways.gov.in/

డీఆర్‌డీఓ ఎస్‌ఎస్‌పీఎల్‌లో 62 ఖాళీలు:
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన తిమార్‌పూర్ (దిల్లీ)లోని డీఆర్‌డీఓసాలిడ్ స్టేట్ ఫిజిక్స్ ల్యాబొరేటరీ (ఎస్‌ఎస్‌పీఎల్) వివిధ విభాగాల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 62
విభాగాల వారీగా ఖాళీలు
మెకానికల్ 10
ఎలక్ట్రానిక్స్ 15
ఎలక్ట్రికల్ 15
కంప్యూటర్ సైన్స్ 10
లైబ్రరీ సైన్స్ 02
ఎంఓపీ (ఇంగ్లిష్ అండ్ హిందీ)10
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణత. 2020/2021/2022లో ఉత్తీర్ణులైన డిప్లొమా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
ఎంపిక విధానం: డిప్లొమాలో సాధిచిన మెరిట్ మార్కుల ఆధారంగా అభ్యర్థుల్ని షార్ట్‌లిస్ట్ చేస్తారు. అనంతరం డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా చేయాలి.
చివరితేది: 25.06.2022
వెబ్‌సైట్: http://portal.mhrdnats.gov.in

అసిస్టెంట్ మైనింగ్ జియాలజిస్టులు:
డిల్లీలోని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వివిధ ప్రభుత్వ విభాగాల్లో కింది పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టులు: 24
సైంటిఫిక్ ఆఫీసర్ (ఫిజికల్ రబ్బర్ ప్లాస్టిక్ టెక్స్‌టైల్): 1పోస్టు
అసిస్టెంట్ మైనింగ్ జియాలజిస్ట్ : 21 పోస్టులు
అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (సివిల్) 2 పోస్టులు
అర్హత: మాస్టర్స్ డిగ్రీ (ఫిజిక్స్/కెమిస్ట్రీ/జియాలజీ లేదా అప్లైడ్ జియాలజీ)లేదా డిగ్రీ (కెమికల్ ఇంజినీరింగ్/టెక్స్‌టైల్ టెక్నాలజీ/రబ్బర్ టెక్నాలజీ/ ప్లాస్టిక్ టెక్నాలజీలో డిగ్రీ/పాలిమర్ అండ్ రబ్బర్ టెక్నాలజీ/కెమికల్ టెక్నాలజీ) ఉత్తీర్ణతతో పాటు సంబంధిత వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి.
ఎంపిక: నియామక పరీక్ష, ఇంటర్వూ ఆధారంగా ..
చివరితేది : 30.06.2022
వెబ్‌సైట్: https://www.upsc.gov.in

ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో 400 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు:

ప్రభుత్వ రంగ సంస్థ ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ)..జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
పోస్టులు: జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్)
మొత్తం పోస్టులు: 400
అర్హత: ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ సబ్జెక్టులతో మూడేళ్ల బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత/బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ (ఏదైనా సెమిస్టర్‌లో ఫిజిక్స్/మ్యాథమెటిక్స్ చదివి ఉండాలి) ఉత్తీర్ణులవ్వాలి. ఇంగ్లిష్‌లో రాయడం, మాట్లాడటంలో కనీసం నైపుణ్యం ఉండాలి.
వయసు: 14.07.2022 నాటికి 27 ఏళ్లు మించకుండా ఉండాలి.
ఎంపిక: దరఖాస్తుల ఆధారంగా అభ్యర్థులను షార్టులిస్ట్ చేసి..ఆన్‌లైన్ రాత పరీక్ష నిర్వహిస్తారు. రాత పరీక్షలో అర్హత సాధించిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్/వాయిస్ టెస్ట్, బ్యాక్ గ్రౌండ్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా తది ఎంపిక చేస్తారు.
దరఖాస్తు: ఆన్‌లైన్ విధానంలో
దరఖాస్తు ప్రారంభం: 15.06.2022
దరఖాస్తులకు చివరితేది: జూలై 14,2022
వెబ్‌సైట్: https://www.aai.aero

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News