Sunday, April 28, 2024

కరెంటు పోతే ఈ నెంబర్లకు కాల్ చేయండి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాల దరిమిలా విద్యుత్‌కు సంబంధించి ఎలాంటి అత్యవసర పరిస్థితి ఉన్నా 1912/ 100/ స్థానిక ఫ్యూజ్ ఆఫ్ కాల్ ఆఫీస్‌లకు కాల్ చేయాలని తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ సిఎండి రఘుమారెడ్డి సూచించారు. విద్యుత్ శాఖ ప్రత్యేక కంట్రోల్ రూమ్ 7382072104, 7382072106, 7382071574 నెంబర్లకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చన్నారు. రాబోవు మూడు రోజుల పాటు భారీ వర్ష సూచనల నేపథ్యంలో జోనల్, సర్కిళ్ళ చీఫ్ జనరల్ మేనేజర్, సూపరింటెండింగ్ ఇంజనీర్లతో సిఎండి టెలికాన్ఫరెన్స్ ద్వారా విద్యుత్ సరఫరా పై సమీక్ష నిర్వహించారు. గ్రేటర్ హైదరాబాద్ నగరంలోని డిజాస్టర్ మేనేజ్‌మెంట్ బృందాలు అప్రమత్తంగా ఉండాలని, చెట్లపై, రోడ్లపై, గృహాలపై విద్యుత్ తీగలు తెగిపడ్డట్లు ఉంటే వాటికి దూరంగా ఉండి వెంటనే విద్యుత్ శాఖ అధికారుల దృష్టికి తేవాలని సూచించారు. రోడ్ల మీద నిల్వ ఉన్న నీళ్ళలో విద్యుత్ వైర్లు గాని, ఇతర విద్యుత్ పరికరాలు మునిగి ఉన్నట్లైతే ఆ నీటిలోకి పోరాదని, సరఫరా సమస్యల పర్యవేక్షణ కోసం ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News