Thursday, May 2, 2024

నూతన రైల్వే లైన్ సర్వేకు నిధులు మంజూరు

- Advertisement -
- Advertisement -

కల్వకుర్తి: గద్వాల నుంచి సూర్యాపేట వరకు 296 కిలో మీటర్ల నూతన రైల్వే లైన్ సర్వే కోసం 7 కోట్ల 40 లక్షల నిధులు మంజూరయ్యాయని పట్టణ బిజెపి అధ్యక్షుడు బోడ నరసింహ, జిల్లా ఉపాధ్యక్షుడు రాఘవేందర్ గౌడ్, బిసి మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి రవి గౌడ్‌లు తెలిపారు.

మంగళవారం పట్టణంలోని బిజెపి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఇప్పటికే మూడు జాతీయ రహదారులు మంజూరై రెండు హైదరాబాద్, శ్రీశైలం, మల్లేపల్లి, జడ్చర్ల జాతీయ రహదారుల పనులు పూర్తై వినియోగంలోకి వచ్చాయన్నారు. మరో రహదారి కల్వకుర్తి, నంద్యాల జాతీయ రహదారి పనులు ప్రారంభమయ్యాయన్నారు. నూతనంగా కొత్తగా రైల్వే లైన్ సర్వేకు నిధులు కేటాయించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడికి, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవికి, జాతీయ రహదారుల మంత్రి గడ్కరీకి కల్వకుర్తి నియోజకవర్గం, పట్టణం తరపున కృతఙ్ఞతలు తెలుపుతున్నామన్నారు.

ఈ అభివృద్ధి పనులకు కృషి, సహకారం అందించిన కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డికి, ప్రాంత నాయకులు, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డికె అరుణ్‌కు, మాజీ జాతీయ బిసి కమిషన్ సభ్యులు, కల్వకుర్తి ప్రాంత ఉద్యమాల బిడ్డ తల్లోజు ఆచారికి కృతఙ్ఞతలు తెలిపారు. దేశ వ్యాప్తంగా అభివృద్ధి ప్రధాన మంత్రి, బిజెపి పార్టీతోనే సాధ్యమవుతుందన్నారు. ఈ సమావేశంలో నాయకులు పట్టణ ఉపాధ్యక్షుడు బాబి దేవ్, ప్రధాన కార్యదర్శి నరేష్ గౌడ్, బిజెవైఎం ప్రధాన కార్యదర్శి పర్వతాలు, పట్టణ అధ్యక్షుడు శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News