Thursday, May 2, 2024

గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కు అంకితం

- Advertisement -
- Advertisement -

Green India Challenge in Guinness Book of World Records

 

మహబూబ్ నగర్ : గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ కు మహబూబ్ నగర్ జిల్లాలోని దేశంలోని అతిపెద్ద కెసిఆర్ ఎకో అర్బన్ పార్క్ ( 2097 ఎకరాలు) వేదికైంది. జిల్లాకు చెందిన మహిళ సమాఖ్య కు చెందిన మహిళలు 10 రోజుల్లో 2 కోట్ల 8 లక్షల విత్తన బంతులను తయారు చేసి వాటిని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా నేడు కేసీఆర్ ఎకో అర్బన్ పార్క్ లోని మైదాన ప్రాంతాల్లో వేద జల్లే కార్యక్రమంలో రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ రూపకర్త, సంతోష్ కుమార్ ముఖ్య అతిథిలుగా పాల్గొని విజయవంతం గా 2 కోట్ల 8 లక్షల సీడ్ బాల్స్ ను వెదజల్లి చారిత్రాత్మక ఘట్టానికి శ్రీకారం చుట్టారు.

రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ రూపకర్త, రాజ్యసభ సభ్యులు శ్రీ జోగినపల్లి సంతోష్ కుమార్ మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఉన్న దేశంలోనే అతిపెద్ద అర్బన్ ఎకో పార్క్ కెసిఆర్ ఎకో పార్క్ లో జిల్లాకు చెందిన మహిళా సంఘాల సభ్యుల ఆధ్వర్యంలో దేశంలో ఎక్కడలేని విధంగా 2 కోట్ల 8 లక్షల విత్తన బంతులను తయారు చేసి వాటిని విజయవంతం గా వెదజెల్లే గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు గా నమోదు అయ్యింది. ఈ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ కు కెసిఆర్ ఎకో అర్బన్ పార్క్ వేదికగా నిలిచింది.

అనంతరం మహబూబ్ నగర్ పట్టణంలో ని రైల్వే ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎంపి సంతోష్ కుమార్ గిన్నిస్ బుక్ ఆఫ్ ఛాలెంజ్ కార్యక్రమం ను పరిశీలించారు. ఈ చారిత్రాత్మక ఘట్టానికి కృషి చేసిన కలెక్టర్, అదనపు కలెక్టర్ లు, జిల్లా అధికార యంత్రాంగం కు , ఎజెడ్ఎంఎస్, డిఆర్ ఢిఎ, ఎంఇపిఎంఎ, హెటిరో గ్రూప్, జిల్లా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ సభ్యులకు, గిన్నీస్ వరల్డ్ రికార్డ్ బృందానికి మంత్రి శ్రీనివాస్ గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాకుండా 2 కోట్ల 8 లక్షల విత్తన బంతులను తయారు చేసి వాటిని విజయవంతం గా వెదజెల్లే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించినందుకు ఈ రికార్డ్ ను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కు అంకితం ఇస్తునట్లు మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఈ సందర్భంగా తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటరావు, ఎస్ పి వెంకటేశ్వర్లు, ఆదనపు కలెక్టర్ తేజాస్ నందులాల్ పవర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీ. రాజేశ్వర్ గౌడ్, మున్సిపల్ చైర్మన్ కెసి నర్సింహులు, వైస్ చైర్మన్ గణేష్, గ్రీన్ ఇండియా ప్రతినిధులు రాఘవ, వెంకటేష్, మాజీ మార్కెట్ చైర్మన్ రాజేశ్వర్, డిఎఫ్ ఓ గంగిరెడ్డి, అటవీశాఖ అధికారులు, వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News