Monday, May 13, 2024

ప్రశాంతంగా ముగిసిన గ్రూప్-1 ప్రిలిమ్స్

- Advertisement -
- Advertisement -

ప్రశాంతంగా ముగిసిన గ్రూప్-1 ప్రిలిమ్స్
61.37 శాతం మంది అభ్యర్థులు హాజరు
సిద్దిపేటలో ప్రశాంత్ అనే అభ్యర్ది అరెస్టు
మాల్ ప్రాక్టీసు కింద కేసు నమోదు చేసిన పోలీసులు
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా గ్రూపు-1 ప్రిలిమ్స్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. 503 ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో భాగంగా నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్ష ఆదివారం ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటకు ముగిసింది. ఈపరీక్షకు 3,80,081 మంది దరఖాస్తు చేసుకున్నారు. 33 జిల్లా కేంద్రాల్లో 994 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించగా 2,33,248 మంది అభ్యర్థులకు హాజరయ్యారు. 61.37 శాతం నమోదైనట్లు టిఎస్‌పిఎస్ పేర్కొంది. పరీక్ష ప్రారంభానికి ముందే పావుగంట పరీక్ష కేంద్రాలు గేట్లు మూసివేశారు.ఉదయం 10.15 గంటల తరువాత అభ్యర్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతివ్వలేదు. పలువురు అ భ్యర్థులు ఆలస్యంగా రావడంతో అధికారులు తిరిగి పంపించారు. పరీక్ష కేంద్రాల వద్ద పోలీసులు 144 సెక్షన్ అమలు చేసి ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నారు.

సిద్దిపేటలో ప్రశాంత్ అనే అభ్యర్ది అరెస్టు ః సిద్దిపేట జిల్లాలో పరీక్ష ప్రారంభం కాకముందే కేంద్రం నుంచి బయటకు వచ్చిన ప్రశాంత్ అనే అభ్యర్దిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పరీక్ష హాల్‌లో కూర్చున్న ప్రశాంత్ ఓఎంఆర్‌షీట్‌లో హాల్‌టికెట్ నంబర్ తప్పుగా రాశాడు. దీంతో పరీక్ష రాసిన వృథాగా బావించిన అభ్యర్ది పరీక్ష కేంద్రం నుంచి బయటకు వచ్చేశారు. దీంతో పోలీసులు ప్రశాంత్ ను అరెస్టు చేశారు. తరువాత మాల్ ప్రాక్టీస్ కింద కేసు నమోదు చేశారు.

గ్రూప్-1 అభ్యర్థులకు పోలీసుల సాయం: గ్రూప్-1 అభ్యర్థులకు నాచారం పోలీసులు తమ ఆపన్న హస్తాన్ని అందించారు. పరీక్ష రాసేందుకు నాచారంలోని జాన్సన్ గ్రామర్ స్కూల్ పరీక్ష కేంద్రానికి పలువురు అభ్యర్థులు చేరుకున్నారు. అయితే వారి పరీక్ష కేంద్రం కాదని అక్కడి అధికారులు చెప్పారు. దీంతో నాచారం పోలీసులు అభ్యర్థులను తమ వాహనాల్లో ఎక్కించుకుని పరీక్ష కేంద్రాలకు చేర్చారు. దీంతో అభ్యర్థులు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.

పరీక్షా కేంద్రాల పటిష్ట బందోబస్తు: సీపీ డిస్ చౌహాన్ ఐపిఎస్
పరీక్ష కేంద్రాలలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామని రాచకొండ సీపీ డిస్ చౌహాన్ ఐపిఎస్ అన్నారు. ఉప్పల్ పీఎస్ పరిధిలో రామంతాపూర్ ప్రీన్ స్టన్ కాలేజ్, నాచారం పీఎస్ పరిధి లోని జాన్సన్ గ్రామర్ హై స్కూల్, కుషాయిగూడ పీఎస్ పరిధిలోని రాధికా ఎక్స్ రోడ్ వద్ద ఒమేగా, శ్రీ చైతన్య కాలేజ్ లను సందర్శించారు. అనంతరం మాట్లాడుతూ పరీక్ష కేంద్రాలలో సెల్ ఫోన్ లకు, ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతివ్వలేదన్నాదు. కన్నుగప్పి తీసుకువస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. పరీక్ష కేంద్రాలలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామని ఆయన అన్నారు. అనంతరం అధికారులకు, సిబ్బందికి తగు సూచనలు, సలహాలు చేశారు. సిపి వెంట మల్కాజిగిరి డిసిపి ధరావత్ జానకి, మల్కాజిగిరి ఏసిపి నరేష్ రెడ్డి, కుషాయిగూడ ఏసిపి వెంకట్ రెడ్డి తదితర పోలీసు అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News