Saturday, May 4, 2024

జెఎస్డబ్ల్యూ వెంచర్స్ $3.5 మిలియన్లను సమీకరించిన గ్రోకామ్స్

- Advertisement -
- Advertisement -

ముంబై: మార్గదర్శక మసాలా టెక్ కంపెనీ అయిన గ్రోకామ్స్ తాజాగా జేఎస్ డబ్ల్యూ వెంచర్స్ & అరాలి వెంచర్స్ నుండి US$3.5 మిలియన్లను సేకరించింది. ఇప్పటికే ఉన్న ఇన్వెస్టర్ ఇన్ఫోఎడ్జ్ వెంచర్స్ కూడా నిధుల సమీకరణలో పాల్గొంది. కంపెనీ సేకరించిన నిధులు ప్రాథమికంగా ఎగుమతులు, విలువ-ఆధారిత సుగంధ ద్రవ్యాల కోసం ట్రేసబిలిటీని ఎనేబుల్ చేయడంలో కీలక సామర్థ్యాలను రూపొందించడానికి, ఉత్పాదన పోర్ట్‌ ఫోలియో, టెక్నాలజీ స్టాక్‌ను బలోపేతం చేయడానికి ఉపయోగించబడతాయి. జేఎస్ డబ్ల్యూ వెంచర్స్ & అరాలి వెంచర్స్ రెండింటికీ అగ్రిటెక్ స్పేస్‌లో పెట్టుబడి ఇదే మొదటిది.

భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద సుగంధ ద్రవ్యాల ఉత్పత్తిదారు. మొత్తం ప్రపంచ వాణిజ్యంలో దాదా పు మూడో వంతు వాటాను కలిగి ఉంది. ప్రపంచ సుగంధ ద్రవ్యాల ఉత్పత్తిలో భారతదేశం 70% వాటాను కలిగి ఉంది. ఈ పరిశ్రమ 10% సీఈజీఆర్ వద్ద వృద్ధి చెందుతుందని అంచనా వేయబడింది. ఇది 2027 నాటికి $27 బిలియన్లకు పెరుగుతుందని అంచనా.

గ్రోకామ్స్ సహ వ్యవస్థాపకుడు & చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జార్జ్ కురియన్ మాట్లాడుతూ.. ‘‘గ్రోకామ్స్‌ కు స్పష్ట మైన లక్ష్యం ఉంది. ఉత్పత్తి సామర్థ్యాలను గరిష్ఠం చేయడం, రైతులకు సాధికారత కల్పించడం ద్వారా సుగంధ ద్రవ్యాల విలువ గొలుసును మెరుగుపరచడం, డిజిటల్ మార్గం ద్వారా ప్రపంచ మార్కెట్లకు గుర్తించ దగిన సుగంధ ద్రవ్యాలను సరఫరా చేయడం. సారూప్యత కలిగిన ఇన్వెస్టర్ల నుంచి పెట్టుబడి, భాగస్వామ్యం గ్రోకామ్స్ తన గ్లోబల్ ఉనికిని బలోపేతం చేయడానికి, విలువ గొలుసు అంతటా సమర్థతను మెరుగు పరచడానికి కచ్చితంగా సహాయం చేస్తుంది’’ అని అన్నారు.

గ్రోకామ్స్‌ లో తమ పెట్టుబడిపై జేఎస్ డబ్ల్యూ వెంచర్స్‌ మేనేజింగ్ పార్ట్‌ నర్ సచిన్ టాగ్రా మాట్లాడుతూ.. ‘‘టెక్ లీడ్ జోక్యంతో మొత్తం సుగంధ ద్రవ్యాల విలువ గొలుసును నిర్వహించడానికి గ్రోకామ్స్ ఫుల్ స్టాక్ విధానం అందరు వాటాదారులకు విలువను సృష్టించగలదు. పరిశ్రమలోని ఈ సంస్థ నేరుగా రైతు స్థాయిలో కూడా ఫలితాల పెరుగుదలకు దారి తీస్తుంది. ఈ వ్యాపారంలో ముందంజలో ఉన్న ట్రేసబిలిటీ సొల్యూషన్స్‌ తో సుగంధ ద్రవ్యాల అవకాశాన్ని ఉపయోగించుకోవడానికి ఈ పెట్టుబడి గ్రోకామ్స్ సామర్థ్యాన్న మరింత మెరుగుపరుస్తుంది’’ అని అన్నారు.

అరాలీ వెంచర్స్ మేనేజింగ్ పార్ట్‌ నర్ రాజీవ్ రఘునందన్ మాట్లాడుతూ.. ‘‘గ్రోకామ్స్ ఫుల్ స్టాక్ బిజినెస్ మోడల్ కొన్ని మార్కెట్ వృద్ధికారక అంశాలు & అంతర్గత సామర్థ్యాలను అవకాశంగా చేసుకుని సుగంధ ద్రవ్యాల విలువ గొలుసును డిజిటలైజ్ చేస్తోంది. దేశవ్యాప్తంగా గణనీయమైన అదనపు ప్రాసెసింగ్ సామర్థ్యం ఉన్న నేపథ్యంలో యురోపియన్ యూనియన్, అమెరికా వంటి మార్కెట్లకు విశ్వసనీయమైన ఎగుమతి సంస్థగా ఉండేందుకు ఆహార సురక్షితకు పూర్తి ట్రేసబిలిటీ & పారదర్శకతను అందించాల్సిన అవసరం ఉంది. జట్టుకు ఉన్న అనుభవం రైతులు & ప్రాసెసర్‌లలో వ్యాపారం సరఫరా వైపు విలువను జోడించడంలో తోడ్పడుతుంది. సంప్రదాయక పరిశ్రమలు సాంకేతిక సాయం ఉపయోగించుకొని గొప్ప వ్యాపార విలువను సంతరించుకోవడంపై అరాలికి గల దృష్టికి అనుగుణంగానే మా పెట్టుబడి ఉంది’’ అని అన్నారు.

గ్రోకామ్స్ గత రెండు సంవత్సరాలలో తన కార్యకలాపాల స్థాయి, పరిధిని గణనీయంగా విస్తరించింది. నేడు, ఇది అన్ని ప్రధాన మసాలా దినుసులను ఉత్పత్తి చేసే ప్రాంతాలలో సోర్సింగ్ హబ్‌లను, విలువ జోడించిన సుగంధ ద్రవ్యాలుగా రూపాంతరం చెందడానికి తనిఖీ చేసిన సరఫరాదారులను కలిగి ఉంది. అలాగే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మార్కెట్ల నుండి డిమాండ్‌ను కలిగి ఉంది. ఇది ప్రస్తుతం ఫుడ్ కంపెనీలు, ఫ్లేవర్ హౌస్‌లు, ఎఫ్‌ఎంసిజి కంపెనీలు, మసాలా బ్రాండ్‌లను విస్తరించి ఉన్న వివిధ రకాల కస్టమర్ల అవసరాలను తీరుస్తోంది. కంపెనీని ఇండిగ్రామ్ ల్యాబ్స్ 2021లో ఇంక్యుబేట్ చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News