Sunday, April 28, 2024

అదరగొట్టిన గుజరాత్

- Advertisement -
- Advertisement -

హార్దిక్ కెప్టెన్సీ అదుర్స్
సమష్టి పోరాటం వల్లే చారిత్రక విజయం

మన తెలంగాణ/ క్రీడా విభాగం : సుదీర్ఘ రో జుల పాటు సాగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) 15వ సీజన్‌కు ఆదివారం తెరపడిన విషయం తెలిసిందే. ఇక ఈ సీజన్‌లో కొత్త ఫ్రాంచైజీ గుజరాత్ టైటాన్స్ అసాధారణ ఆట తో చాంపియన్‌గా అవతరించింది. ఆడిన తొలి సీజన్‌లోనే ట్రోఫీని సొంతం చేసుకుని గుజరాత్ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకుంది. తొలి సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ సాధించిన రికార్డును గుజరాత్ మళ్లీ తిరగరాసింది. హార్దిక్ పాండ్యే నాయకత్వ ప్రతిభకు ఆటగాళ్ల సమష్టి పోరాటం తోడు కావడంతో గుజరాత్ చారిత్రక విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సీజన్‌లో గుజరాత్ ఆరంభం నుంచే అత్యంత నిలకడైన ఆటను కనబరిచింది. కొత్త జట్టు అనే ఒత్తిడి ఎక్కడ కనిపించలేదు. ముంబై ఇండియన్స్, కోల్‌కతా, చెన్నై, సన్‌రైజర్స్ వంటి అగ్రశ్రేణి జట్లు వరుస ఓటములతో చతికల పడిన పరిస్థితుల్లో గుజరాత్ అసాధారణ ఆటతో చాంపియన్‌గా నిలిచింది.
ముందుండి నడిపించాడు..
గుజరాత్ చాంపియన్‌గా అవతరించిందంటే దా నిలో కెప్టెన్ హార్దిక్ పాండ్య ప్రతిభ దాగివుందనే చెప్పాలి. తొలి మ్యాచ్ నుంచే హార్దిక్ అద్భుత కె ప్టెన్సీని కనబరిచాడు. సారథ్య బాధ్యతలను సక్రమంగా నిర్వరించడమే కాకుండా ఆటగాళ్లలో కొత్త స్ఫూర్తిని నింపాడు. అంతేగాక ఇటు బంతి తో అటు బ్యాట్‌తో కూడా తనదైన శైలీలో రాణించాడు. కొంతకాలంగా పేలవమైన ఫామ్‌తో సతమతమవుతున్న హార్దిక్ ఐపిఎల్‌లో మాత్రం అ సాధారణ ఆటతో చెలరేగి పోయాడు. కెప్టెన్సీ ఒత్తిడి అతనిలో ఏమాత్రం కనిపించలేదు. క్లిష్ట సమయాల్లోనూ నిబ్బరంగా ఉంటు ఆటగాళ్లలో ధైర్యాన్ని నూరిపోశాడు. ఇతర జట్ల కెప్టెన్లతో పోల్చితే హార్దిక్ అత్యంత నిలకడైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఫైనల్లో ఆల్‌రౌండ్‌షోతో అదరగొట్టాడు. హార్దిక్ పూర్వవైభవం సాధించడం టీమిండియాకు అతి పెద్ద ఊరటగా చెప్పాలి.
సమష్టిగా రాణించారు..
మరోవైపు ఇతర ఆటగాళ్లు కూడా తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించారు. ఓపెనర్లు వృద్ధిమాన్ సాహా, శుభ్‌మన్ గిల్‌లు పలు మ్యాచుల్లో జట్టుకు శుభారంభాన్ని అందించారు. సాహా ఈ సీజన్‌లో అంచనాలకు మించి రాణించాడనే చె ప్పాలి. జట్టు యాజమాన్యం తనపై ఉంచిన న మ్మకాన్ని నిలబెట్టాడు. గిల్ కూడా బాగానే ఆడా డు. ఇక డేవిడ్ మిల్లర్ అయితే ఆకాశమే హద్దు గా చెలరేగి పోయాడు. గుజరాత్ ట్రోఫీ సాధించడంలో మిల్లర్ పాత్ర చాలా కీలకం అనడంలో ఎలాంటి సందేహం లేదు. బౌలింగ్‌లో మహ్మద్ షమి, హార్దిక్, రషీద్ ఖాన్, యశ్ దయాల్, ఫె ర్గూసన్ తదితరులు అద్భుతంగా రాణించారు. షమి, రషీద్‌ప్దాపాపు ప్రతి మ్యాచ్‌లోనూ జట్టుకు అండగా నిలిచారు. ఇలా బ్యాట్స్‌మెన్, బౌలర్లు తమవంతు పాత్రను సక్రమంగా నిర్వర్తిచడంతో గుజరాత్ అరంగేట్రం సీజన్‌లోనే ట్రోఫీని సొం తం చేసుకుని నయా చరిత్రను లిఖించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News