Thursday, May 2, 2024

రాజస్థాన్‌లో గుర్జర్ల రిజర్వేషన్ ఆందోళన

- Advertisement -
- Advertisement -

Gurjar reservation concern in Rajasthan

 

ఢిల్లీ ముంబయి మార్గంలో నిలిచిన రైళ్లు

జైపూర్ : రాజస్థాన్‌లో విద్య, ఉద్యోగాల్లో 5 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ గుర్జర్లు మరోసారి ఆందోళన బాట పట్టారు. ఆదివారం నుంచి నిరవధిక ఆందోళనకు గుర్జర్ ఆరక్షణ్ సంఘర్ష్ సమితి పిలుపునిచ్చింది. ఓవైపు 14 డిమాండ్లపై గుర్జర్ నేతలు రాజస్థాన్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వంతో చర్చలు జరుపుతుండగా ఆందోళన కొనసాగడం గమనార్హం. ఆదివారం భరత్‌పూర్ జిల్లా బయానాలోని రైల్వే ట్రాక్‌పై ఆందోళనకారులు పెద్ద సంఖ్యలో నిరసన చేపట్టారు. ఆందోళన వల్ల ఢిల్లీముంబయి రైలు మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి.

బయానాహిందాన్ రోడ్డు మార్గంలోనూ అంతరాయం ఏర్పడిందని పోలీసులు తెలిపారు. పలు జిల్లాల్లో నిషేధాజ్ఞలు విధించిన రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్‌నెట్ సేవల్ని నిలిపివేసింది. గుర్జర్ల 14 డిమాండ్లలో తమకు కల్పించే 5 శాతం రిజర్వేషన్లను రాజ్యాంగంలోని తొమ్మిదో షెడ్యూల్‌లో చేర్చాలన్నది కీలకం. ఇది కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశం కావడంతో అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం ఇరకాటంలో పడింది. మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించేందుకు వీల్లేదంటూ గుర్జర్ల రిజర్వేషన్లపై రాజస్థాన్ హైకోర్టు విధించిన స్టే ప్రస్తుతం కొనసాగుతోంది. ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వచ్చే వరకూ ఆందోళన కొనసాగిస్తామని గుర్జర్ నేతలు తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News