Tuesday, August 5, 2025

హన్సిక చేసిన పనితో.. విడాకుల రూమర్స్‌కి మరింత బలం..

- Advertisement -
- Advertisement -

టాలీవుడ్‌లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా ఉన్న నటి హన్సిక (Hansika Motwani). అయితే కొంతకాలంగా ఆమె సినిమాలకు దూరంగా ఉంటున్న ఈ బ్యూటీ.. పలు టివి షోలకు జడ్జిగా వ్యవహరిస్తుంది. అయితే కొన్ని రోజులుగా హన్సిక తన భర్త సోహెల్‌తో విడాకులు తీసుకుంటుందని వార్తలు సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై ఆమె భర్త సోహెల్‌ను ప్రశ్నించగా.. ఆ వార్తల్లో నిజం లేదంటూ చెప్పారు. కానీ, ఈ విడాకుల గురించి రూమర్స్ రావడం మాత్రం ఆగలేదు.

హన్సిక (Hansika Motwani) 2022లో సోహెల్‌ని వివాహం చేసుకుంది. చిన్ననాటి నుంచి స్నేహితులుగా ఉన్న వీరు వివాహ బంధంతో ఒకటయ్యారు. సోహెల్‌కి ఇది రెండో పెళ్లి. తొలుత రింకీ బజాజ్ అనే యువతిని అతను వివాహం చేసుకున్నాడు. ఆ పెళ్లికి హన్సిక కూడా హాజరైంది. కానీ, రింకీతో సోహెల్ విడాకులు తీసుకున్న తర్వాత హన్సిక అతనికి మరింత క్లోజ్ అయింది. 2022లో జైపూర్‌లో జరిగిన వీరి వివాహ విశేషాలను ‘లవ్ షాదీ డ్రామా’ అంటూ ఓ వీడియోని కూడా ఒటిటిలో విడుదల చేశారు. ఆ వీడియోలో హన్సిక భావోద్వేగానికి గురైంది. తన భర్త గతం గురించి తెలుసని.. కానీ, అతడి విడాకులతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పింది.

అయితే ఇఫ్పుడు మనస్పర్ధలు వచ్చి వీరిద్దరు వేర్వేరుగా ఉంటున్నారని తెలుస్తోంది. సోహెల్‌ది పెద్ద కుటుంబం కావడంతో.. వారితో హన్సిక కలవలేకపోయిందని.. అందుకే తన తల్లితో ఉంటోందని సోషల్‌మీడియాలో వార్తలు వచ్చాయి. త్వరలోనే విడాకులు తీసుకుంటున్నారని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. తాజాగా హన్సిక చేసిన ఓ పని ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూర్చాయి. హన్సిక తన పెళ్లికి సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్ నుంచి డిలీట్ చేసింది. దీంతో వాళ్లు విడాకులు తీసుకోవడం కన్ఫామ్ అని పుకార్లు వస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News