Tuesday, May 7, 2024

మాస్కులు పంపిణీ చేసిన మంత్రి హరీశ్ రావు..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కరోనా మరోసారి విజృంభిస్తుండడంతో మాస్క్ ధరించని వారికి రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖమంత్రి తన్నీర్ హరీశ్ రావు మాస్కులు పంపిణీ చేశారు. ఆదివారం ఉదయం నగరంలోని చైతన్య పురి కాలనీలో ఓ ప్రైవేట్ ఆస్పత్రిని మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు కారు దిగినప్పటి నుండి మాస్క్ లేని వారు కనిపిస్తే తన వద్ద ఉన్న మాస్క్ లు అందజేసి వారితో‌ సంభాషించారు. కరోనా కట్టిడి చేయాలంటే మాస్క్ తప్పనిసరిగా పెట్టుకోవాలని, ఏ మాత్రం అలసత్యంగా ఉండొద్దని చెప్పారు. మీరు మీ కుటుంబం ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలంటే మాస్క్ ధరించాలని అన్నారు. రెండు డోసుల‌ టీకా వేసుకున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు‌. ప్రభుత్వం రేపటి నుండి అరవై ఏళ్లు దాటిన వారికి మూడో డోస్, బూస్టర్ డోస్ ఇస్తుందని చెప్పారు. ఇలా ఓ మంత్రి తమ యోగక్షేమాలు అడగడంతో పాటు, కరోనా జాగ్రత్తలు చెప్పి మాస్క్ లు‌ పంపిణీ చేయడంతో ఆనందం వ్యక్తుం చేశారు.

Harish Rao distributes Masks in Hyderabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News