Home తాజా వార్తలు సిఎం కెసిఆర్ ముందుచూపుతో ప్రజలకు వైద్యారోగ్య సేవలు: హరీశ్ రావు

సిఎం కెసిఆర్ ముందుచూపుతో ప్రజలకు వైద్యారోగ్య సేవలు: హరీశ్ రావు

వ‌న‌ప‌ర్తి: ఉమ్మ‌డి మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాలో రూ.1500 కోట్లతో మూడు ప్రభుత్వ వైద్య కళాశాలలను ఏర్పాటు చేశామ‌ని మంత్రి హ‌రీశ్‌రావు తెలిపారు. మంగళవారం వనపర్తిలో పర్యటిస్తున్న మంత్రి హరీశ్ రావు.. రూ.17 కోట్లతో నిర్మించిన మాతా శిశు ఆరోగ్యకేంద్రాన్ని మంత్రి నిరంజ‌న్ రెడ్డితో క‌లిసి ప్రారంభించారు. అనంతరం సీసీ రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వనపర్తి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, గద్వాలలో రూ.200 కోట్లతో నర్సింగ్ కళాశాలలను ఏర్పాటు చేస్తున్నామ‌ని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపు, ప్రణాళికతో ప్రజలకు వైద్యారోగ్య సేవలు అందుబాటులోకి తెచ్చామ‌న్నారు. కేసీఆర్ కిట్లతో ప్రభుత్వ ఆసుపత్రులలో 54 శాతం కాన్పులు పెరిగాయ‌న్నారు. రాష్ట్రంలో రూ.407 కోట్లతో 23 ప్రసూతి ఆసుపత్రులు, రూ.30 కోట్లతో ప్రసూతి గదుల నిర్మాణం జ‌రుగుతుంద‌న్నారు. పుట్టిన పిల్లల కోసం ఎస్ఎన్ సీయూ కేంద్రాలను ఏడేళ్లలో 65కి పెంచామ‌ని మంత్రి తెలిపారు.

Harish Rao inaugurates Mother & Child Health Center