Wednesday, May 1, 2024

రెండురోజుల పాటు పలుచోట్ల వర్షాలు

- Advertisement -
- Advertisement -

Heavy Rain Alert For Next 2 Days

హైదరాబాద్ : రానున్న రెండురోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ ఆంధ్రప్రదేశ్, ఉత్తర తమిళనాడు తీరాలకు దగ్గరలో నైరుతి బంగాళాఖాతం, దానిని అనుకొని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతాల్లో 5.8 కి.మీల ఎత్తువరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని అధికారులు తెలిపారు. ఇది ఎత్తుకు వెళ్లేకొద్దీ నైరుతి వైపునకు వంపు తిరిగి ఉందని పేర్కొంది.

పైన తెలిపిన ఉపరితల ఆవర్తనం నుంచి పశ్చిమ విదర్భ వరకు దక్షిణ కోస్తాంధ్ర తెలంగాణ 1.5 కి.మీల ఎత్తు వద్ద ఉపరితల ద్రోణి ఆవర్తనం ఏర్పడిందని అధికారులు తెలిపారు. అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలతో పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. బుధవార రాత్రి, గురువారం, శుక్రవారాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.

Heavy Rain Alert For Next 2 Days

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News