Friday, April 26, 2024

Rain: రాష్ట్రంలో నేడు, రేపు వడగండ్ల వాన

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్‌: రాష్ట్రంలో శుక్ర, శనివారాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉరుములు , మెరుపులు, ఈదురు గాలులతో  కూడిన వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం  తెలిపింది. పలు ప్రాంతాల్లో వడగండ్లతో కూడిన భారీవర్షాలు కురుస్తాయని పేర్కొంది. పెద్దపల్లి, కుమ్రం భీం ఆసిఫాబాద్‌, కరీంనగర్‌ జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిశాయి.

శుక్రవారం అక్కడక్కడ ఉరుములు, మెరుపులతోపాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. శనివారం ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. పగటిపూట అధిక ఉష్ణోగ్రతలు, సాయంత్రం వాన కురిసే అవకాశం ఉందని, ప్రస్తుతం సాధారణం కన్నా ఒక డిగ్రీ అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News