Tuesday, May 7, 2024

నగరాన్ని వణికిస్తున్న వరుణుడు

- Advertisement -
- Advertisement -

Heavy rains to continue in Hyderabad

హైదరాబాద్: నగరంలో వర్షం బీభత్సం సృష్టించింది. బుధవారం సాయంత్రం ప్రారంభమైన వర్షం నగర వ్యాప్తంగా అర్థరాత్రి వరకు కొనసాగింది. శుక్రవారం తెల్లవారుజాము నుంచే పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. కుండపోతవర్షంతో నగరం పూర్తిగా జల దిగ్బంధం కావడంతో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగిపోయ్యాయి. రోడ్లు, వీధుల గుండా వరద నీరు పొటేత్తడంతో కాలనీలు, బస్తీలు, రోడ్లన్నీ బురదమయంగా మారాయి. దీంతో జిహెచ్‌ఎంసి పారిశుధ్య కార్మికులతో పాటు సహాయ బృందాలను బురదను తొలగించి రోడ్లను శుభ్రం చేశారు. బుధవారం నగరంలో పలు ప్రాంతాల్లో ఏకంగా 11.3 సెమీ వర్షం కురువడంతో నగరం పూర్తిగా నదులను తలపించింది.

గురువారం ఉదయం వరకు పలు కాలనీలు, బస్తీలు జల దిగ్బంధంలోనే ఉన్నాయి. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీట మునుగడంతో ఇళ్లులోకి నీరు చేరి స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఒక వైపువర్షం మరోవైపు ఇళ్లలో చేరిన వరదనీటిలో రాత్రి గడిపారు. మరోవైపు విద్యుత్ సైతం లేకపోవడం చిమ్మ చీకట్లలో అష్టకష్టాలు పడ్డారు. భారీ వర్షంతో సహాయ బృందాలు సైతం ఏమి చేయలేని పరిస్థితులు ఏర్పడడంతో నగరవాసులు కష్టాలు తప్పలేదు. రోడ్లపై వాహనదారులు పరిస్థితి మరింత దారుణమైంది. ప్రధాన రహదారుల్లో సుమారు 4 నుంచి 5 గంటల పాటు ట్రాఫిక్ జామ్‌లోనే చిక్కుబడి పోయ్యారు. ఒకవైపు వర్షం, మరోవైపు ట్రాఫిక్ జామ్‌తో తడిసి ముద్దైయ్యారు. భారీ వర్షం దెబ్బకు నగరంలో పలు ప్రాంతాల్లో రోడ్లు కుండిపోవడమే కాకుండా పెద్ద సంఖ్యలో ధ్వంసం అయ్యాయి. దీంతో వాహనదారులు గురువారం మరింత ఇబ్బందులు పడ్డారు.

సహాయ చర్యలో జిహెచ్‌ఎంసి నిమగ్నం

భారీ వర్షం నేపథ్యంలో బుధవారం సాయంత్రం నుంచి జిహెచ్‌ఎంసి అత్యవసర సహాయ బృందాలు సహాయ చర్యల్లో నిమగ్నమైయ్యారు. 3 షిప్టుల్లో 24 గంటల పాటు సేవలను అందిస్తున్నారు. నగర వ్యాప్తంగా వాటర్ లాంగింగ్, ప్రహారిగోడ కూలిపోడంం, చెట్లు, చెట్ల కొమ్మలు విరిగిపడడం, రోడ్లపై గుంతలు తదితర సహాయ చర్యలకు సంబంధించి నగర వ్యాప్తంగా జిహెచ్‌ఎంసి కాల్ సెంటర్‌తో పాటు డయల్ 100, మై జిహెచ్‌ఎంసి ద్వారా 205 ఫిర్యాదులు అందాయి. భారీ వర్షం కారణంగా నగర వ్యాప్తంగా రోడ్లపై బురద మేటలు వేయడంతో దానిని పూర్తిగా తొలగించి రోడ్లను వీధులను శుభ్రపర్చారు. అదేవిధంగా మ్యాన్ హోళ్లు ఎక్కడికక్కడ పొంగుతుండడంతో వాటిని బాగు చేసిన రోడ్లపైకి నీరు రాకుండా చర్యలు తీసుకున్నారు. అదేవిధంగా లోతట్టు ప్రాంతాల్లో నిలిచిన నీరును మోటర్ల సహాయం తొలగించి అక్కడ అంటువ్యాధులు ప్రభలకుండా పారిశుధ్య కార్యక్రమాలను నిర్వహించారు. వీధులు, రోడ్లపై బ్లీచింగ్ చల్లారు.

30 ప్రాంతాల్లో భారీ వర్షం నమోదు

నగరంలో గురువారం ఉదయం 8.30 గంటల వరకు 30 ప్రాంతాల్లో భారీ వర్ష పాతం నమోదైంది. 6.5 సె.మి నుంచి 11.3 సె.మి.ల వర్షం కురిసింది. అదేవిధంగా 105 ప్రాంతాల్లో మోస్తారు వర్షం కురువగా, మరో 14 పారతాల్లో సాధారణ వర్ష పాతం నమోదైంది. అదేవిధంగా గురువారం ఉదయం 9 గంటల నుంచి రాత్రి వరకు బాలానగర్‌లో 7.5సె.మి. నేరడ్‌మెట్‌లో 5.4, ఫతేనగర్‌లో4.98, పెద్ద అంబర్‌పేట్‌లో 4.95,ఓల్డ్ బోయిన్‌పల్లిలో 4.88,బేగంపేట్‌లో 4 సె.మిలు వర్షం కురిసింది. అదేవిధంగా పాటు పలు ప్రాంతాల్లో 2 సె.మి నుంచి 4 సెమిలోపు వర్ష పాతం నమోదైంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News