Tuesday, September 23, 2025

బిజెపిలో చేరిన హీరో వరుణ్ సందేశ్ తల్లి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: హ్యాపీడేస్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటుడు వరుణ్ సందేశ్ (Varun Sandesh). ఒకప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉండే వరుణ్.. ప్రస్తుతం సినిమాలు చేయడం లేదు. అయితే ఇప్పుడు వరుణ్ తల్లి డాక్టర్ రమణి రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఆమె తాజాగా భారతీయ జనతా పార్టీలో చేరారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు ఆమెకు కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా డాక్టర్ రమణి మాట్లాడుతూ.. సమాజసేవ చేయడం అంటే తనకు చాలా ఇష్టమని అన్నారు. హిందుత్వం అంటే తమ కుటుంబానికి ఇష్టమని.. అందుకే బిజెపిలో చేరినట్లు వివరించారు. పార్టీ బలోపేతం కోసం తన వంతు కృషి చేస్తానని ఆమె తెలిపారు.

Also Read : అది ఫేక్ వీడియో.. 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News