Tuesday, April 30, 2024

వ్యాపారవేత్తను పెళ్లి చేసుకున్న హీరోయిన్ ప్రణీత.. ఫోటోలు వైరల్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: అందాల కన్నడ బ్యూటీ ప్ర‌ణీత సుభాష్ అభిమానులకు షాకిచ్చింది. తన పెళ్లిపై ఎలాంటి సమాచారం ఇవ్వకుండా స‌డెన్ గా పెళ్లిచేసుకుని అభిమానులతోపాటు అందరినీ ఆశ్చ‌ర్యానికి గురిచేసింది. తాజాగా ఈ బ్యూటీ పెళ్లి ఫోటోలు బయటకు వచ్చాయి. ఆదివారం మే 30న ప్రణీత, వ్యాపార‌వేత్త అయిన నితిన్ రాజును పెళ్లాడింది.

అతికొద్దిమంది కుటుంబ‌స‌భ్యులు, స్నేహితులు, స‌న్నిహితుల మధ్య బెంగ‌ళూరులో చాలా సింపుల్ గా ప్రణీత వివాహం చేసుకుంది. ప్రస్తుతం ప్ర‌ణీత పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా, ప్రణీత.. ఎన్టీఆర్, ప‌వ‌న్‌క‌ల్యాణ్, మ‌హేశ్ బాబు వంటి స్టార్ హీరోలతోపాటు పలువురు యంగ్ హీరోలతో కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

Heroine Pranitha get married with Nitin Raju

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News