Friday, April 26, 2024

దసరా ర్యాలీ నిర్వహణకు ఉద్ధవ్ శివసేనకు హైకోర్టు అనుమతి

- Advertisement -
- Advertisement -

High Court allows Uddhav Shiv Sena to organize Dussehra rally

ముంబై: దసరా ర్యాలీ నిర్వహించడానికి మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే నాయకత్వంలోని శివసేనకు బొంబాయి హైకోర్టు అనుమతి ఇచ్చింది. అక్టోబర్ 2 నుంచి అక్టోబర్ 6వ తేదీ మధ్య సెంట్రల్ ముంబైలోని శివాజీ పార్కులో వార్షిక దసరా ర్యాలీ నిర్వహించుకోవడానికి అనుమతి కోరుతూ ఉద్ధవ్ థాక్రేకు చెందిన శివసేన దాఖలు చేసిన పిటిషన్‌పై బొంబాయి హైకోర్టు శుక్రవారం అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీచేసింది. హైకోర్టు ఉత్తర్వులపై శివసేన ఎంపి ప్రియాంక చతుర్వేది ట్విట్టర్ వేదికగా హర్షం వ్యక్తం చేశారు. ఒకే పార్టీ నాయకుడు, ఒకే శివసేన, ఒకే శివతీర్థ, ఒకే చోట దసరా ఉత్సవం, అక్టోబర్ 5న పులి గాండ్రింపు వినపడుతుంది అంటూ ఆమె ట్వీట్ చేశారు. ఒక రాజకీయ పార్టీగా 1966లో శివసేన ఆవిర్భవించినప్పటి నుంచి శివాజీ పార్కులో దసరా ర్యాలీని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో ఉద్ధవ్ థాక్రే వర్గానికి చెందిన శివసేన పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News