Wednesday, May 8, 2024

పోడు భూములపై హైకోర్టులో విచారణ

- Advertisement -
- Advertisement -

High Court Inquiry in the on Podu lands

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ

హైదరాబాద్:  రాష్ట్రంలో పోడు భూముల అంశంపై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. వేలాది మంది ఆదివాసులను అడవి నుండివెల్ల గొట్టడాన్ని సవాలు చేస్తూ చెరుకు సుధాకర్, రిటైర్డ్ ప్రొఫెసర్ పిల్ విశ్వేశ్వర్ రావు, అదివాసి పోరాట సమితి నేత కబ్బాక శ్రవణ్‌లు సంయుక్తంగా హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్రశర్మ, జస్టిస్ ఎ.రాజశేఖర్ రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. పోడు భూములపై ఆధారపడిన ఆదివాసీలు, ఇతర పేదలను ఖాళీ చేయించే ప్రయత్నం జరుగుతోందని పిటిషనర్ తరఫు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదించారు.

ఆదివాసీల సాగు భూములను ఖాళీ చేయించడం రాజ్యాంగానికి, సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధమని వాదించారు. పోడు భూముల్లో సాగు చేసుకుంటున్న వారికి పట్టాలు ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. వాదనలు విన్న హైకోర్టు ఆదివాసీలు, ఇతర పేదలు సాగుచేసుకుంటున్న పోడు భూములపై వివరాలు సమర్పించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హైకోర్టు ఆదేశించింది. ఆరు వారాల్లో స్పందించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను వచ్చే ఏడాడి (2022) జనవరి 21కి వాయిదా వేసింది.

గొర్రెల పంపిణీపై 

రాష్ట్రంలో గొర్రెల పంపిణీపై సిబిఐ విచారణకు ఆదేశించేందుకు హైకోర్టు నిరాకరించింది. సుమారు 5 వేల కోట్ల రూపాయలతో గొర్రెలు, దాణా పంపిణీలో అవినీతి, అక్రమాలు జరిగాయంటూ వాచ్ వాయిస్ ఆఫ్ ది పీపుల్ సంస్థ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టులో విచారణ ముగిసింది. విచారణకు ఆదేశించదగిన కారణాలు కనిపించడం లేదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ ఎ.రాజశేఖర్ రెడ్డి ధర్మాసనం పేర్కొంది. అవినీతి, అక్రమాలు, దుర్వినియోగంపై విచారణ జరిపేందుకు లోకాయుక్తకు పూర్తి అధికారాలు ఉన్నాయని హైకోర్టు తెలిపింది. లోకాయుక్తకు ఫిర్యాదు చేసి ఆధారాలను సమర్పించవచ్చునని పిటిషనర్‌కు హైకోర్టు సూచించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News