Tuesday, April 30, 2024

హాకీలో భారత్ శుభారంభం

- Advertisement -
- Advertisement -

టోక్యో: ఒలింపిక్స్‌లో భారత పురుషుల హాకీ జట్టు శుభారంభం చేసింది. శనివారం జరిగిన మొదటి మ్యాచ్‌లో భారత్ 32 గోల్స్ తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించింది. అయితే మహిళల విభాగంలో భారత్‌కు పరాజయం ఎదురైంది. భారత మహిళా జట్టు నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓటమి పాలైంది. ఇక భారత్‌న్యూజిలాండ్ జట్ల మధ్య పోరు ఆరంభం నుంచే ఆసక్తికరంగా సాగింది. ఆట ఆరో నిమిషంలోనే కివీస్ తొలి గోల్ సాధించింది. కేన్ రసెల్ పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలచి న్యూజిలాండ్‌కు ఆధిక్యం అందించాడు. అయితే మరో నాలుగు నిమిషాల తర్వాత భారత్ స్కోరును సమం చేసింది. రూపిందర్‌పాల్ సింగ్ అద్భుత గోల్‌తో కివీస్ ఆధిక్యాన్ని సమం చేశాడు. తర్వాత కూడా రెండు జట్లు నువ్వానేనా అన్నట్టు పోరాడాయి. ఒకరి గోల్ పోస్ట్‌పై మరొకరూ దాడి చేస్తూ గోల్ కోసం ప్రయత్నించాయి. కాగా 26వ నిమిషంలో భారత్ ప్రయత్నం ఫలించింది. హర్మన్‌ప్రీత్ సింగ్ అద్భుత గోల్‌తో భారత్‌కు ఆధిపత్యం సాధించి పెట్టాడు. మరోవైపు కివీస్ స్కోరును సమం చేసేందుకు తీవ్రంగా శ్రమించినా ఫలితం లేకుండా పోయింది. ఇక ఆట 36వ నిమిషంలో హర్మన్‌ప్రీత్ భారత్‌కు మూడో గోల్ అందించాడు. ఆ తర్వాత భారత్ దూకుడును మరింత పెంచింది. ఇక కివీస్ కూడా తీవ్రంగా పోరాడింది. కాగా స్టీఫెన్ జోసెఫ్ అద్భుత గోల్‌తో భారత్ ఆధిక్యాన్ని తగ్గించాడు. ఇక చివర్లో భారత గోల్ కీపర్ శ్రీజేశ్ అసాధారణ ప్రతిభతో కివీస్ ఆటగాడు కొట్టిన పెనాల్టీ కార్నర్ సమర్థంగా అడ్డుకున్నాడు. దీంతో భారత్ 32తో మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. ఆదివారం జరిగే మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో భారత్ తలపడుతుంది.
మనికా బాత్రా ముందంజ
మహిళల టిటిలో మనికా బాత్రా శుభారంభం చేసింది. శనివారం జరిగిన మొదటి రౌండ్‌లో బాత్రా విజయం సాధించింది. బ్రిటన్ క్రీడాకారిణి టిన్ టిన్ హోతో జరిగిన పోరులో బాత్రా 117, 116, 1210, 119తో జయకేతనం ఎగుర వేసింది. ఆరంభం నుంచే దూకుడును ప్రదర్శించిన బాత్రా ఏ దశలోనూ ప్రత్యర్థికి కోలుకునే అవకాశం ఇవ్వలేదు. 40తో ఆధిక్యంతో రెండో రౌండ్‌కు దూసుకెళ్లింది. మరో మ్యాచ్‌లో సుతీర్థ ముఖర్జీ విజయం సాధించింది. స్వీడన్ క్రీడాకారిణితో జరిగిన పోరులో ముఖర్జీ 43తో పోరాడి విజయం సాధించింది. లిండాకాగా మిక్స్‌డ్ డబుల్స్‌లో మాత్రం భారత్‌కు చుక్కెదురైంది.

Hockey men's Team win at Tokyo Olympic
నాగల్ విజయం
పురుషుల టెన్నిస్ సింగిల్స్ విభాగంలో భారత ఆటగాడు సుమిత్ నాగల్ తొలి రౌండ్‌లో విజయం సాధించాడు. శనివారం జరిగిన పోరులో నాగల్ 64, 67, 64తో ఉజ్బెకిస్థాన్ ఆటగాడు డెన్నిస్ ఇస్తోమిన్‌ను ఓడించాడు. తొలి సెట్‌లో గెలిచిన నాగల్‌కు రెండో సెట్‌లో చుక్కెదురైంది. అయితే ఫలితాన్ని తేల్చే మూడో సెట్‌లో గెలిచిన నాగల్ ముందంజ వేశాడు.
సాత్విక్ జోడీ బోణీ
బ్మాడ్మింటన్ పురుషుల డబుల్స్ గ్రూప్ విభాగం పోటీల్లో భారత్ శుభారంభం చేసింది. సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి జోడీ తొలి రౌండ్‌లో విజయం సాధించింది. చైనీస్ తైపీ జోడీ యాంగ్‌లీచిన్ లిన్ వాంగ్‌తో జరిగిన పోరులో చిరాగ్ జంట 2116, 1621, 2724తో జయకేతనం ఎగుర వేసింది. అయితే సింగిల్స్ విభాగంలో భారత ఆటగాడు సాయి ప్రణీత్ నిరాశ పరిచాడు. తొలి మ్యాచ్‌లోనే ప్రణీత్ ఓటమి పాలయ్యాడు. మహిళల హాకీలో కూడా భారత్ ఓటమి చవిచూసింది. ఏకపక్ష మ్యాచ్‌లో నెదర్లాండ్స్ 51 గోల్స్ తేడాతో భారత్‌ను చిత్తు చేసింది.

Hockey men’s Team win at Tokyo Olympic

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News