- Advertisement -
న్యూఢిల్లీ: హాంకాంగ్ సిక్సెస్ క్రికెట్ టోర్నమెంట్‌లో పాల్గొనే టీమిండియాకు మాజీ క్రికెటర్ దినేశ్ కార్తీక్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఈ విషయాన్ని నిర్వాహకులు మంగళవారం అధికారికంగా ధ్రువీకరించారు. నవంబర్ 7 నుంచి ఈ టోర్నీ జరుగనుంది. హాంకాంగ్ సిక్సెస్ టోర్నీకి ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. ఈ టోర్నీలో పాల్గొనే భారత జట్టుకు సారథ్యం వహించే అవకాశం రావడంపై దినేశ్ కార్తీక్ ఆనందం వ్యక్తం చేశాడు. ఇది తనకు దక్కిన అరుదైన గౌరవంగా అభివర్ణించాడు. కాగా, ఈ టోర్నీలో రవిచంద్రన్ అశ్విన్ కూడా బరిలోకి దిగనున్నాడు.
- Advertisement -